Telugu Global
NEWS

ఏపీ నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త

గ్రూప్-1, గ్రూప్‌-2 పరీక్షల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. గ్రూప్‌ పోస్టుల విలీనంపై ఇప్పటి వరకు ఎదురుచూసిన ఎపీపీఎస్‌సీ… ఇప్పుడు పరీక్ష తేదీల ఖరారు కోసం కసరత్తు మొదలుపెట్టింది. గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్ని గ్రూప్‌-1లో కలిపి భర్తీ చేయాలని ఎపీపీఎస్‌సీ పంపిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం తిరస్కరించింది. పాత పద్దతిలోనే పోస్టులను భర్తీ చేయాలని ఈనెల 21న సాధారణ పరిపాలన విభాగం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పరీక్ష తేదీల కోసం ఏపీపీఎస్‌సీ చర్చలు […]

ఏపీ నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త
X

గ్రూప్-1, గ్రూప్‌-2 పరీక్షల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. గ్రూప్‌ పోస్టుల విలీనంపై ఇప్పటి వరకు ఎదురుచూసిన ఎపీపీఎస్‌సీ… ఇప్పుడు పరీక్ష తేదీల ఖరారు కోసం కసరత్తు మొదలుపెట్టింది.

గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్ని గ్రూప్‌-1లో కలిపి భర్తీ చేయాలని ఎపీపీఎస్‌సీ పంపిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం తిరస్కరించింది.

పాత పద్దతిలోనే పోస్టులను భర్తీ చేయాలని ఈనెల 21న సాధారణ పరిపాలన విభాగం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పరీక్ష తేదీల కోసం ఏపీపీఎస్‌సీ చర్చలు జరుపుతోంది. గ్రూప్‌-1లో 182 పోస్టులు, గ్రూప్‌-2లో 337 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఇది వరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వారంలోగా గ్రూప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలను ఏపీపీఎస్‌సీ ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం లేదా గురువారం జూనియర్‌ లెక్చరర్ , పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లు విడుదల చేయనుందట.

First Published:  25 Dec 2018 10:38 PM GMT
Next Story