Telugu Global
Cinema & Entertainment

ఆర్ధిక వివాదంలో రవితేజ?

రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్ టైమ్ డిజాస్టర్ గా మిగిలింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి ఈ సినిమా భారీ నష్టాలని మిగిల్చింది. నిజానికైతే ఈ సినిమా షూటింగ్ టైం లోనే రవితేజతో కలిసి మూడు సినిమాలు చేయాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుందట. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా అట్టర్ ఫ్లాప్ తో…. ఇప్పుడు రవితేజతో కుదుర్చుకున్న […]

ఆర్ధిక వివాదంలో రవితేజ?
X

రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్ టైమ్ డిజాస్టర్ గా మిగిలింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి ఈ సినిమా భారీ నష్టాలని మిగిల్చింది.

నిజానికైతే ఈ సినిమా షూటింగ్ టైం లోనే రవితేజతో కలిసి మూడు సినిమాలు చేయాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుందట. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా అట్టర్ ఫ్లాప్ తో…. ఇప్పుడు రవితేజతో కుదుర్చుకున్న ఈ మూడు సినిమాల ఒప్పందం నుంచి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వెనకడుగు వేసిందన్న వార్తలొస్తున్నాయి. కానీ రవితేజ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదని సమాచారం.

తనకు రెండు సినిమాల పారితోషికం ఇస్తే కానీ మూడు సినిమాల డీల్ నుంచి బయటకు రానని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. తమిళనాట హిట్ అయిన “తేరి” సినిమా రీమేక్ రవితేజతో ప్లాన్ చేశారు. దీనికోసం ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ క‌థ కూడా సిద్ధం చేసాడు.

కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకుందట మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. రవితేజ మాత్రం తనకి డబ్బులు ఇస్తేనే అగ్రిమెంట్ కాన్సిల్ చేసుకుంటాను అని అంటున్నాడట. మరి హీరోకి, నిర్మాతకి మధ్య నడుస్తున్న ఈ గొడవలో ఎవరు నేగ్గుతారో చూడాలి.

First Published:  25 Dec 2018 8:01 PM GMT
Next Story