Telugu Global
NEWS

లోక్‌సభలోనూ వార్‌ వన్‌సైడే " సీ ఓటర్‌ సర్వే

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్‌ఎస్ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని చెబుతోంది ”రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్ సర్వే”. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కారు జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ప్రతిపక్షాలకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా వచ్చే అవకాశం లేదని రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. 17 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాలను సొంతం చేసుకుంటుందని వివరించింది. మిగిలిన […]

లోక్‌సభలోనూ వార్‌ వన్‌సైడే  సీ ఓటర్‌ సర్వే
X

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్‌ఎస్ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని చెబుతోంది ”రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్ సర్వే”. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కారు జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని సర్వే చెబుతోంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ప్రతిపక్షాలకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా వచ్చే అవకాశం లేదని రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. 17 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాలను సొంతం చేసుకుంటుందని వివరించింది. మిగిలిన ఒక్క స్థానం కూడా ఎంఐఎం చేతిలోకి వెళ్తుందని సర్వే చెబుతోంది.

టీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో 42. 4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా… కాంగ్రెస్- టీడీపీ కూటమికి 29.1 శాతం, బీజేపీకి 12. 6 శాతం, ఎంఐఎంకు 4. 7 శాతం, ఇతరులకు 11. 3 శాతం ఓట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ- సీఓటర్ సర్వే చెబుతోంది.

ఇదే సంస్థ నవంబర్‌లో వెల్లడించిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 9 లోక్‌స్థానాలు, కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి ఆరు, బీజేపీ, ఎంఐఎంలకు చెరో లోక్‌సభ స్థానం వస్తుందని అప్పట్లో వెల్లడించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఊపు తర్వాత ఇప్పుడు 16 లోక్‌సభ స్థానాలు కారుకే దక్కుతాయని సర్వే చెబుతోంది.

First Published:  24 Dec 2018 11:25 PM GMT
Next Story