Telugu Global
Cinema & Entertainment

ఆ డైరెక్టర్ తో సినిమా ఆగిపోయినట్లేనా?

వరుణ్ తేజ్ “అంతరిక్షం” అనే సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ హిట్ తో ఊపు మీద వరుణ్ తేజ్ “ఎఫ్ 2” సినిమాతో ప్రేక్షకుల ముందుకి త్వరలో రానున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ హీరో సాగర్ చంద్ర అనే దర్శకుడితో సినిమా చెయ్యాలి వరుణ్. “అయ్యారే” “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర చెప్పిన […]

ఆ డైరెక్టర్ తో సినిమా ఆగిపోయినట్లేనా?
X

వరుణ్ తేజ్ “అంతరిక్షం” అనే సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ హిట్ తో ఊపు మీద వరుణ్ తేజ్ “ఎఫ్ 2” సినిమాతో ప్రేక్షకుల ముందుకి త్వరలో రానున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక హీరోగా నటించాడు.

ఇదిలా ఉంటే ఈ హీరో సాగర్ చంద్ర అనే దర్శకుడితో సినిమా చెయ్యాలి వరుణ్. “అయ్యారే” “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర చెప్పిన లైన్ నచ్చి వరుణ్ తేజ్ ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పాడట.

కానీ సినిమా అనౌన్స్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తున్నా కూడా ఇంకా కథ కొలిక్కి రాలేదట. అలాగే ఆ సినిమాకి భారీ బడ్జెట్ కూడా కావాలట. కాబట్టి కథ పూర్తిగా కంప్లీట్ అయ్యాకే సినిమా స్టార్ట్ చెయ్యాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నాడట.

మరోవైపు 14 రీల్స్ సంస్థ ఈ విషయంలో ఏమి పట్టించుకోకపోవడంతో ప్రస్తుతానికి ఆ సినిమా ఆగిపోయినట్లేనన్నది ఫిలిం నగర్ టాక్.

First Published:  24 Dec 2018 5:00 AM GMT
Next Story