Telugu Global
NEWS

గాజు గ్లాస్ గుర్తుపై పవన్ ఏమన్నారంటే....!

గాజు గ్లాస్ తో తనకెన్నో జ్ఞాపకాలున్నాయని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును కేటాయించడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమ పార్టీకి గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్ కు పవన్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. “మా పార్టీకి గుర్తుగా గాజు గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గాజు గ్లాస్ తో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మనదేశంలో సాధారణ పౌరుడి […]

గాజు గ్లాస్ గుర్తుపై పవన్ ఏమన్నారంటే....!
X

గాజు గ్లాస్ తో తనకెన్నో జ్ఞాపకాలున్నాయని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును కేటాయించడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమ పార్టీకి గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్ కు పవన్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

“మా పార్టీకి గుర్తుగా గాజు గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గాజు గ్లాస్ తో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మనదేశంలో సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదేనని” ట్విట్టర్ లో తెలిపారు.

ఈ సందర్భంగా గాజు గ్లాస్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లాస్ గుర్తు ఫొటో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు జన సైనికులు.

పార్టీ గుర్తు లేదని ఇన్నాళ్లు బాధపడుతున్న ఫ్యాన్స్….ఇప్పుడు గుర్తు కేటాయించడంతో నేరుగా రంగంలోకి దిగారు. పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతుగా సోషల్ మీడియాను ఎంచుకున్నారు.

First Published:  23 Dec 2018 9:20 PM GMT
Next Story