Telugu Global
International

పుతిన్ స్టయిలే వేరు.... సెల్ ఫోన్ లేదు.... కంప్యూటర్ ఉండదు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పుతిన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తానే స్వయంగా ప్రెస్ మీట్లో వెల్లడించారు. అయితే పుతిన్ కు సంబంధించిన మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచమంతా టెక్నాలజీపై ఆధారపడి పరుగులు పెడుతుంటే…. పుతిన్ మాత్రం అసలు మొబైలే వాడరట. ఆయన కంప్యూటర్ కు ఇంటర్నెట్ ఉండదట. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయ […]

పుతిన్ స్టయిలే వేరు.... సెల్ ఫోన్ లేదు.... కంప్యూటర్ ఉండదు!
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పుతిన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తానే స్వయంగా ప్రెస్ మీట్లో వెల్లడించారు.

అయితే పుతిన్ కు సంబంధించిన మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచమంతా టెక్నాలజీపై ఆధారపడి పరుగులు పెడుతుంటే…. పుతిన్ మాత్రం అసలు మొబైలే వాడరట. ఆయన కంప్యూటర్ కు ఇంటర్నెట్ ఉండదట. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. పుతిన్ వీటన్నింటికి దూరంగా ఉండటానికి కారణాలూ ఉన్నాయట.

సమాచారం గోప్యంగా ఉండేందుకే పుతిన్ ఇంటర్నెట్, మొబైల్ కు ఆమడదూరంలో ఉంటారని పేర్కొన్నారు. సెల్ ఫోన్ల వల్ల అత్యంత సున్నితమైన విషయాలు బయటకు పొక్కే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని…. సెల్ ఫోన్ వాడటం అంటే వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించడమేనని పెస్కోవ్ తెలిపారు.

భారత ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పెస్కోవ్ వెల్లడించిన విషయాలకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని ఏ కంప్యూటర్ పైన అయినా నిఘా పెట్టెందుకే పోలీసులు, దర్యాప్తు సంస్థలకు వీలు కల్పిస్తూ…ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

First Published:  22 Dec 2018 8:30 PM GMT
Next Story