Telugu Global
Cinema & Entertainment

రాజశేఖర్ కూతురు సినిమా ఆగిపోయిందా?

సీనియర్ హీరో రాజశేఖర్ తన కూతురు శివాని ని హీరోయిన్ గా పెట్టి “2 స్టేట్స్” అనే రీమేక్ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ లాంచ్ కి ఎందరో చీఫ్ గెస్ట్ లు వచ్చారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ బాగానే జరుపుకున్నా…. ఈ సినిమా రెండో షెడ్యూల్ మాత్రం తడపడుతూ నడుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందనే వార్త బయటకి వచ్చింది. […]

రాజశేఖర్ కూతురు సినిమా ఆగిపోయిందా?
X

సీనియర్ హీరో రాజశేఖర్ తన కూతురు శివాని ని హీరోయిన్ గా పెట్టి “2 స్టేట్స్” అనే రీమేక్ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ లాంచ్ కి ఎందరో చీఫ్ గెస్ట్ లు వచ్చారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ బాగానే జరుపుకున్నా…. ఈ సినిమా రెండో షెడ్యూల్ మాత్రం తడపడుతూ నడుస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందనే వార్త బయటకి వచ్చింది. క్రియేటివ్‌ విభాగం పరంగా అడవిశేష్‌ కి, డైరెక్టర్‌ వెంకట్‌ కి మధ్య గొడవల కారణంగానే ఈ సినిమా ఆగిపోయింది అనే టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ దెబ్బకు ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఈ సినిమాని వదిలేసి వెళ్ళిపోయారట. ఇక శేష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా శేష్ ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

First Published:  22 Dec 2018 9:51 PM GMT
Next Story