Telugu Global
Cinema & Entertainment

నేను అలాంటి అమ్మాయిని కాదు.... ఇలాంటి ప్రచారం వద్దు....

ఇండస్ట్రీ కి వచ్చి ఏడాది కాకముందే తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది సాయి పల్లవి. ఇప్పుడు ఈ భామకి తెలుగు లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే ఈ భామ నటించిన “పడి పడి లేచే మనసు” రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో శర్వానంద్ తో సాయి పల్లవికి గొడవ అయ్యిందని రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ని శర్వానంద్ ఆడియో […]

నేను అలాంటి అమ్మాయిని కాదు.... ఇలాంటి ప్రచారం వద్దు....
X

ఇండస్ట్రీ కి వచ్చి ఏడాది కాకముందే తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది సాయి పల్లవి. ఇప్పుడు ఈ భామకి తెలుగు లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే ఈ భామ నటించిన “పడి పడి లేచే మనసు” రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో శర్వానంద్ తో సాయి పల్లవికి గొడవ అయ్యిందని రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ని శర్వానంద్ ఆడియో లాంచ్ రోజే కొట్టిపడేశాడు.

ఇక ఇప్పుడు సాయి పల్లవి కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ…. ”అసలు నేను ఏ హీరోని డామినేట్ చెయ్యను. నేను అలాంటి అమ్మాయిని కాదు…. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దు…. ఒకవేళ శర్వానంద్ ని సెట్ లో డామినేట్ చేసి ఉంటే మా మధ్య అంత మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యేది కాదని, అల్లాగే శర్వా కూడా ఏదో సీనియర్ హీరోలాగా బిల్డ్ అప్ ఇవ్వకుండా చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ చాలా ఫ్రెండ్లీ గా ఉండే వాడు” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

దీన్ని బట్టి చూస్తుంటే నాగ శౌర్య కి , సాయి పల్లవికి “కణం” టైం లో జూనియర్ సీనియర్ విషయంలోనే గొడవ అయ్యింది అని అంటున్నారు.

First Published:  23 Dec 2018 1:01 AM GMT
Next Story