Telugu Global
Cinema & Entertainment

800 డ్యాన్సర్స్ తో రామ్‌ చరణ్‌ భారీ సాంగ్

మాస్ డైరెక్టర్ బోయపరి శ్రీను దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ ఐటెం సాంగ్ లో ఐటెం గర్ల్ గా బాలీవుడ్ భామ ఈశా గుప్త ను తీసుకున్నారు. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఖానాపూర్ అనే విలేజ్ దగ్గర భారీ సెట్ ని వేయించాడు […]

800 డ్యాన్సర్స్ తో రామ్‌ చరణ్‌ భారీ సాంగ్
X

మాస్ డైరెక్టర్ బోయపరి శ్రీను దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది.

ఈ ఐటెం సాంగ్ లో ఐటెం గర్ల్ గా బాలీవుడ్ భామ ఈశా గుప్త ను తీసుకున్నారు. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఖానాపూర్ అనే విలేజ్ దగ్గర భారీ సెట్ ని వేయించాడు బోయపాటి శ్రీను. ఇదే సెట్ లో కొన్ని రోజుల పాటు ఈ ఐటెం సాంగ్ ని షూట్ చేయనున్నారు మూవీ యూనిట్. ఈ ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే ఎనిమిది వందల మంది డ్యాన్సర్స్ ని రప్పించాడట బోయపాటి శ్రీను.

రామ్ చరణ్ ఎనర్జీ కి ఈ ఎనిమిది వందల మంది డ్యాన్సర్‌లు కూడా తోడైతే ఇక ఇది కంప్లీట్ మాస్ సాంగ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

First Published:  23 Dec 2018 6:00 AM GMT
Next Story