Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు తెలుగులోకి ప్రియా వారియర్

ఒక్క సెకెండ్ అలా కన్ను కొట్టి యావత్ భారతదేశాన్ని కట్టిపడేసింది ప్రియా వారియర్. రొమాంటిక్ కామెడీగా మలయాళంలో తెరకెక్కిన సినిమాలోని క్లిప్ అది. ఇప్పుడా సినిమా తెలుగులోకి వస్తోంది. అది కూడా ప్రేమికుల రోజు కానుకగా ముస్తాబవుతోంది. ప్రియా వారియర్ నటించిన ”ఒరు ఆదార్ లవ్” అనే సినిమాను ”లవర్స్ డే” పేరిట తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా టాలీవుడ్ స్క్రీన్స్ పైకి రాబోతోంది. అలా ప్రియా వారియర్ తెలుగు తెరపై కనిపించబోతోంది. […]

ఎట్టకేలకు తెలుగులోకి ప్రియా వారియర్
X

ఒక్క సెకెండ్ అలా కన్ను కొట్టి యావత్ భారతదేశాన్ని కట్టిపడేసింది ప్రియా వారియర్. రొమాంటిక్ కామెడీగా మలయాళంలో తెరకెక్కిన సినిమాలోని క్లిప్ అది. ఇప్పుడా సినిమా తెలుగులోకి వస్తోంది. అది కూడా ప్రేమికుల రోజు కానుకగా ముస్తాబవుతోంది.

ప్రియా వారియర్ నటించిన ”ఒరు ఆదార్ లవ్” అనే సినిమాను ”లవర్స్ డే” పేరిట తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా టాలీవుడ్ స్క్రీన్స్ పైకి రాబోతోంది. అలా ప్రియా వారియర్ తెలుగు తెరపై కనిపించబోతోంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ లో నిలిచింది ప్రియా వారియర్.

ఇండియాలోని మొత్తం నెటిజన్లలో దాదాపు 70శాతం మంది ఈమె కన్నుగీటే సన్నివేశాన్ని చూసి ఆనందించారు. ఆ తర్వాత ఈమె కన్ను కొట్టే సన్నివేశంతో ఎన్నో స్పూఫ్స్ కూడా వచ్చాయి.

ఆమెకు అమాంతం వచ్చిన క్రేజ్ చూసి తెలుగులో ఆమెతో నేరుగా ఓ సినిమా చేయాలని కొంతమంది నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఆమె చెప్పిన పారితోషికం విని కళ్లుతేలేశారు.

మళ్లీ ఇన్నాళ్లకు తను నటించిన మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్ తో తెలుగు తెరపైకి వస్తోంది ప్రియా వారియర్. గురురాజ్, వినోద్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

First Published:  23 Dec 2018 4:00 AM GMT
Next Story