Telugu Global
CRIME

హైవేపై యాక్సిడెంట్‌... ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏం చేశారంటే...

కడప జిల్లా రామాపురం మండలం బండపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన ఒక కుటుంబం కారులో వస్తుండగా బండపల్లె గ్రామం గన్‌షాద్‌ వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. అందులో ప్రమాణిస్తున్న వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంతలో రాయచోటి నుంచి అటుగా వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి … కారు ఫల్టీలు కొట్టిన విషయాన్ని గమనించి వెంటనే కారు ఆపారు. వెళ్లి తన సిబ్బందితో కలిసి వారిని కారులో నుంచి బయటకు […]

హైవేపై యాక్సిడెంట్‌... ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏం చేశారంటే...
X

కడప జిల్లా రామాపురం మండలం బండపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన ఒక కుటుంబం కారులో వస్తుండగా బండపల్లె గ్రామం గన్‌షాద్‌ వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. అందులో ప్రమాణిస్తున్న వారికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇంతలో రాయచోటి నుంచి అటుగా వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి … కారు ఫల్టీలు కొట్టిన విషయాన్ని గమనించి వెంటనే కారు ఆపారు. వెళ్లి తన సిబ్బందితో కలిసి వారిని కారులో నుంచి బయటకు తీశారు.

108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కాసేపు ఎదురుచూసినా అంబులెన్స్ సకాలంలో వచ్చే సూచనలు కనిపించకపోవడంతో వెంటనే శ్రీకాంత్ రెడ్డి తన కారులోనే నెత్తురోడుతున్న వారిని ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో స్వయంగా చేర్పించి మెరుగైన వైద్యం అందిచాల్సిందిగా వైద్యులను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు.

First Published:  22 Dec 2018 12:34 AM GMT
Next Story