Telugu Global
NEWS

కొండా మురళి రాజీనామా.... వేటుకు ముందే నిర్ణయం

తిరగబడ్డ వాళ్లకు ప్రజల నుంచి తిరుగుబాటే ఎదురైంది. కొన్నేళ్లుగా జిల్లాలోని పలు నియోజకవర్గాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న వారికి గులాబీ పార్టీ చెక్ పెట్టింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ-మురళి దంపతులకు కాలం కలిసిరాలేదు.  కొండా దంపతులు ఎన్నికలకు ముందు కేసీఆర్, కేటీఆర్ ను తిట్టి  కాంగ్రెస్ లో చేరడం జరిగిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ధాటికి కొండా సురేఖ-మురళీయే కాదు.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కొట్టుకుపోయారు. మంత్రి అవుదామని కలలు గన్న కొండా […]

కొండా మురళి రాజీనామా.... వేటుకు ముందే నిర్ణయం
X

తిరగబడ్డ వాళ్లకు ప్రజల నుంచి తిరుగుబాటే ఎదురైంది. కొన్నేళ్లుగా జిల్లాలోని పలు నియోజకవర్గాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న వారికి గులాబీ పార్టీ చెక్ పెట్టింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ-మురళి దంపతులకు కాలం కలిసిరాలేదు.

కొండా దంపతులు ఎన్నికలకు ముందు కేసీఆర్, కేటీఆర్ ను తిట్టి కాంగ్రెస్ లో చేరడం జరిగిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ధాటికి కొండా సురేఖ-మురళీయే కాదు.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కొట్టుకుపోయారు. మంత్రి అవుదామని కలలు గన్న కొండా సురేఖ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలువలేకపోయింది.

గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రతికార చర్యలకు దిగింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీల పదవులు ఊడగొట్టించే పనికి పూనుకుంది. శాసన మండలి చైర్మన్ కు ఫిరాయింపు ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేసింది. చైర్మన్ పార్టీ మారిన కొండా మురళి, రాములు నాయక్, భూపతిరెడ్డిలకు నోటీసులు కూడా అందించారు. వీరిని సస్పెండ్ చేయడం లాంఛనమే.

ఈ నేపథ్యంలో కొండా మురళి ఈరోజు శనివారం ఉదయం గౌరవంగా రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ఎలాగూ అనర్హత వేటు విధించకముందే కొండా మురళి ప్రీ ప్లాన్ డ్ గా రాజీనామా సమర్పించారు. అధికార పార్టీ సస్పెండ్ చేస్తే చులకన అయిపోతామని…. అందుకే ఆత్మగౌరవం కోసం ఈయన రాజీనామా చేశారని అంటున్నారు.

రాజీనామా చేసిన అనంతరం కొండా మురళి-సురేఖ మాట్లాడారు. టీఆర్ఎస్ దాయదాక్షిణ్యాలపైన ఆధారపడి తాము లేమని.. అందుకే వారు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు మురళి ప్రకటించారు. ప్రజలవైపు నిలబడతామని.. టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.

First Published:  22 Dec 2018 1:31 AM GMT
Next Story