Telugu Global
Cinema & Entertainment

"గబ్బర్ సింగ్" ఫీట్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్న హరీష్ శంకర్

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గత ఏడాది “డీజే” సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చెయ్యలేదు. మధ్యలో దిల్ రాజు బ్యానర్ లో “దాగుడు మూతలు” అనే సినిమా కథ స్టార్ట్ చేసిన కూడా కాస్టింగ్ సెట్ అవ్వక ఆ సినిమాని వదులుకున్నాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ తమిళ “జిగ‌ర్తండా” ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ […]

గబ్బర్ సింగ్ ఫీట్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్న హరీష్ శంకర్
X

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గత ఏడాది “డీజే” సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా స్టార్ట్ చెయ్యలేదు.

మధ్యలో దిల్ రాజు బ్యానర్ లో “దాగుడు మూతలు” అనే సినిమా కథ స్టార్ట్ చేసిన కూడా కాస్టింగ్ సెట్ అవ్వక ఆ సినిమాని వదులుకున్నాడు హరీష్ శంకర్.

ఇక ఇప్పుడు హరీష్ శంకర్ తమిళ “జిగ‌ర్తండా” ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కథని మార్చే పనిలో హరీష్ శంకర్ బిజీగా ఉన్నాడు.

కేవలం తమిళ సినిమా నుంచి కథ మాత్రమే తీసుకొని మిగతాది మొత్తం తన మార్క్ కామెడీ తో నింపెయ్యాలి అని హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యాడట.

“గబ్బర్ సింగ్” సమయంలో కూడా హరీష్ శంకర్ ఇలాగే చేసాడు. కేవలం కథని మాత్రమే తీసుకొని తన సొంత స్టైల్ లో కథనం తో పాటు కామెడీ సీన్స్ ని రాసుకున్నాడు.

ఇక ఇప్పుడు “జిగ‌ర్తండా” కోసం ఇలా చేస్తున్నాడు హరీష్ శంకర్. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నటించబోతున్నాడు.

First Published:  22 Dec 2018 4:18 AM GMT
Next Story