Telugu Global
NEWS

టీ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.... విలీనం దిశగా....

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌కు ఫిరాయింపులు షాక్‌ ఇస్తున్నాయి. ప్రతిపక్షాన్ని మరింత బలహీన పరిచేందుకు కేసీఆర్‌ ఫిరాయింపులకు పచ్చజెండా ఊపారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్‌ను కలిసి తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరారు. మెజారిటీ ఎమ్మెల్సీల నిర్ణయం ఇదేనని వారు చైర్మన్‌కు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలున్నారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా […]

టీ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.... విలీనం దిశగా....
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌కు ఫిరాయింపులు షాక్‌ ఇస్తున్నాయి. ప్రతిపక్షాన్ని మరింత బలహీన పరిచేందుకు కేసీఆర్‌ ఫిరాయింపులకు పచ్చజెండా ఊపారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్నారు.

కాంగ్రెస్‌కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్‌ను కలిసి తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరారు. మెజారిటీ ఎమ్మెల్సీల నిర్ణయం ఇదేనని వారు చైర్మన్‌కు వివరించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలున్నారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. ఆ ఆరుగురిలో నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ వైపు నిలబడ్డారు. ఇప్పటికే దామోదర్‌ రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లు నిన్న కేసీఆర్‌ను కలిశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి తమను టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరారు. మెజారిటీ ఎమ్మెల్సీలు ఒక గ్రూపుగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నందున తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు చట్టం కూడా అంగీకరిస్తుందని ఫిరాయింపుదారుల వాదన.

First Published:  20 Dec 2018 11:21 PM GMT
Next Story