Telugu Global
NEWS

చంద్రబాబు ఫొటోలపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం.... వర్మకు వార్నింగులు

దర్శకుడు వర్మ…. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ సాంగ్‌ను చూసిన చంద్రబాబు అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాటలో కల్పిత పాత్రలకు సంబంధించిన ఫొటోలను కాకుండా నేరుగా చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల ఫొటోలను వర్మ వాడేశారు. సాంగ్ ట్రాక్‌ మీద ఎన్టీఆర్‌తో చంద్రబాబు కలిసి ఉన్న ఒరిజినల్‌ ఫొటోలను వాడారు వర్మ. పాటలో చంద్రబాబు గోతికాడ నక్క, నమ్మకద్రోహి, కలియుగ శకుని […]

చంద్రబాబు ఫొటోలపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం.... వర్మకు వార్నింగులు
X

దర్శకుడు వర్మ…. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ సాంగ్‌ను చూసిన చంద్రబాబు అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాటలో కల్పిత పాత్రలకు సంబంధించిన ఫొటోలను కాకుండా నేరుగా చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల ఫొటోలను వర్మ వాడేశారు.

సాంగ్ ట్రాక్‌ మీద ఎన్టీఆర్‌తో చంద్రబాబు కలిసి ఉన్న ఒరిజినల్‌ ఫొటోలను వాడారు వర్మ. పాటలో చంద్రబాబు గోతికాడ నక్క, నమ్మకద్రోహి, కలియుగ శకుని అంటూ అభివర్ణించారు.

పాట మొత్తం మీద చంద్రబాబును విలన్‌గా చూపించారు. ఇలా చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాకు సంబంధించిన కల్పిత పాత్రల దృశ్యాలను వాడకుండా నేరుగా చంద్రబాబు ఫొటోలను వేసి విలన్‌గా చిత్రీకరించడానికి ఎంత ధైర్యం అని మండిపడుతున్నారు. టీడీపీ అభిమాన మీడియా సంస్థలు కూడా వర్మపై దాడి మొదలుపెట్టాయి.

వెంటనే పాటను తొలగించాలని లేనిపక్షంలో వర్మపై కోర్టుకు వెళ్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే వర్మ యూబ్యూబ్‌లో పాటను విడుదల చేశారు కాబట్టి దానికి సెన్సార్ బోర్డు అనుమతి ఏమీ అవసరం లేదంటున్నారు. కావాలనే వర్మ … బాలకృష్ణ నటిస్తున్న బయోపిక్‌కు పోటీగా ప్రచారం పొందేందుకు ఇలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి టీడీపీ అభ్యంతరాలకు వర్మ ఎలా స్పందిస్తారో!.

First Published:  21 Dec 2018 6:48 AM GMT
Next Story