Telugu Global
Cinema & Entertainment

నాగ చైతన్య అలా.... నాగార్జున ఇలా....

అక్కినేని నాగ చైతన్య ఇటీవలే “సవ్యసాచి” సినిమాతో ఫ్లాప్ ని చవిచూసి డల్ అయిపోయాడు. ఇక చేసేది లేక ప్రస్తుతం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో తనకి సెట్ అయ్యే ఒక కథని రాయించుకుంటున్నాడు నాగ చైతన్య. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసాడు. ఈ సినిమాని రూపొందించేందుకు నాగార్జున తన టీమ్ తో కలిసి డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడట. దర్శకుడు దొరకగానే ఈ చిత్ర యూనిట్ ఈ […]

నాగ చైతన్య అలా.... నాగార్జున ఇలా....
X

అక్కినేని నాగ చైతన్య ఇటీవలే “సవ్యసాచి” సినిమాతో ఫ్లాప్ ని చవిచూసి డల్ అయిపోయాడు. ఇక చేసేది లేక ప్రస్తుతం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో తనకి సెట్ అయ్యే ఒక కథని రాయించుకుంటున్నాడు నాగ చైతన్య.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసాడు. ఈ సినిమాని రూపొందించేందుకు నాగార్జున తన టీమ్ తో కలిసి డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడట. దర్శకుడు దొరకగానే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ ని మీడియా కి తెలియజేస్తారట.

నాగ చైతన్య దృష్టి లో మాత్రం ఈ కథని ఒక కొత్త కుర్రాడితో తెరకేక్కించాలి అని భావిస్తున్నాడట. కానీ నాగార్జున మాత్రం కాస్త మార్కెట్ ఉన్న డైరెక్టర్ అయితేనే విజయేంద్ర ప్రసాద్ కథకి న్యాయం చేయగలడు అని భావిస్తున్నాడట. ఇలా నాగ చైతన్య అలా ఆలోచిస్తే…. నాగార్జున మాత్రం ఇలా ఆలోచిస్తున్నాడట. చూడాలి…. ఈ కథకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడో.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతు “మజిలీ” సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.

First Published:  21 Dec 2018 7:00 AM GMT
Next Story