Telugu Global
NEWS

టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. అవసరం ఉన్నా… లేకున్నా… ప్రతిపక్షాలను కుంగదీసేందుకు అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలని మండలి చైర్మన్‌ను ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు తాను కూడా అదే పనిచేస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌లు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వీరిద్దరు ముఖ్యమంత్రి […]

టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు
X

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. అవసరం ఉన్నా… లేకున్నా… ప్రతిపక్షాలను కుంగదీసేందుకు అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలని మండలి చైర్మన్‌ను ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు తాను కూడా అదే పనిచేస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటోంది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌లు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వీరిద్దరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం. ఆకుల లలిత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

నిజానికి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ కె. దామోదర్‌ రెడ్డిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసేందుకు మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీతో కలిసి సంతోష్‌ కుమార్, ఆకుల లలితలు.. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కలిసేందుకు వెళ్లారు. కానీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం ఫిర్యాదు చేయాలని భావించారు.

ఇంతలోనే షబ్బీర్ అలీతో పాటు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సంతోష్ కుమార్‌, ఆకుల లలితలు కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించేందుకు సిద్ధమయ్యారు.

First Published:  20 Dec 2018 9:39 PM GMT
Next Story