Telugu Global
CRIME

మచిలీపట్నం సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనూహ్య హత్య కేసులో ఉరి

మచిలీపట్నానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ అనూహ్య హత్య కేసులో బాంబే హైకోర్టు తీర్పు వెలువడింది. హంతకుడికి బాంబే హైకోర్టు ఉరి శిక్ష విధించింది. హంతకుడు చంద్రభాను సనప్‌ కు ఉరి శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్ధించింది. తీర్పు పట్ల అనూహ్య తండ్రి సురేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందన్నారు. హంతకుడికి మరణశిక్ష సరైనదేనన్నారు. ఇలాంటి దారుణాలు చేయకుండా మరొకరికి ఈ తీర్పు ఒక గుణపాఠం అన్నారు. […]

మచిలీపట్నం సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనూహ్య హత్య కేసులో ఉరి
X

మచిలీపట్నానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ అనూహ్య హత్య కేసులో బాంబే హైకోర్టు తీర్పు వెలువడింది. హంతకుడికి బాంబే హైకోర్టు ఉరి శిక్ష విధించింది. హంతకుడు చంద్రభాను సనప్‌ కు ఉరి శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్ధించింది.

తీర్పు పట్ల అనూహ్య తండ్రి సురేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందన్నారు. హంతకుడికి మరణశిక్ష సరైనదేనన్నారు. ఇలాంటి దారుణాలు చేయకుండా మరొకరికి ఈ తీర్పు ఒక గుణపాఠం అన్నారు.

చంద్రభాను సనప్‌

ముంబైలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనూహ్య క్రిస్‌మస్ పండుగకు మచిలీపట్నం వచ్చింది. తిరిగి ముంబై బయలు దేరింది. 2014 జనవరి 5 తెల్లవారుజామున ఐదు గంటలకు ముంబైలోని కుర్లా స్టేషన్లో దిగింది. టాక్సీ కోసం వెతుకుతుండగా… టాక్సీ డ్రైవర్‌ చంద్రభాను ఆమెతో మాటలు కలిపాడు. లిప్ట్ ఇస్తానంటూ బైక్‌పై తీసుకెళ్లాడు.

టాక్సీలో కాకుండా బైక్‌పై లిప్ట్‌ ఇవ్వడాన్ని ఆమె తొలుత తిరస్కరించారు. అయితే పక్కనే టాక్సీ ఉందంటూ బైకుపై తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అనూహ్యపై అత్యాచారం చేశాడు. ముళ్లపొదల్లోకి ఈడ్చుకెళ్లి హత్య చేసి పారిపోయాడు.

చంద్రభాను సనప్‌

రైల్వేస్టేషన్ లోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చంద్రభానే అనూహ్యను తీసుకెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. 2014 మార్చి 2న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాదనల తర్వాత 2015 అక్టోబర్‌లో చంద్రభానుకు కింది కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇప్పుడు ఆ శిక్షను హైకోర్టు కూడా సమర్ధించింది.

First Published:  21 Dec 2018 2:14 AM GMT
Next Story