Telugu Global
Cinema & Entertainment

యువ హీరోకు అన్నయ్యా అంటూ షాక్ ఇచ్చిన సాయి పల్లవి

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా “పడి పడి లేచే మనసు”. డిసెంబర్ 21 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ శర్వానంద్, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని అంటున్నారు. అయితే తెరమీద శర్వానంద్ తో రొమాన్స్ చేసిన ఈ భామ తెరవెనుక మాత్రం శర్వానంద్ ని అన్న అని పిలుస్తుందట. ఇది వినడానికి కొంచెం షాకింగ్ గా ఉన్నప్పటికీ తనకు శర్వా బాగా నచ్చడంతో సొంత […]

యువ హీరోకు అన్నయ్యా అంటూ షాక్ ఇచ్చిన సాయి పల్లవి
X

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా “పడి పడి లేచే మనసు”. డిసెంబర్ 21 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ శర్వానంద్, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని అంటున్నారు.

అయితే తెరమీద శర్వానంద్ తో రొమాన్స్ చేసిన ఈ భామ తెరవెనుక మాత్రం శర్వానంద్ ని అన్న అని పిలుస్తుందట. ఇది వినడానికి కొంచెం షాకింగ్ గా ఉన్నప్పటికీ తనకు శర్వా బాగా నచ్చడంతో సొంత అన్నయ్యలా భావించి అన్నయ్యా అని పిలుస్తోందట.

షూటింగ్ లో అన్నయ్య, అన్నయ్య అని సందడి చేస్తుంటే మూవీ యూనిట్ కి చాలా బాగా అనిపించేదట. సాయి పల్లవి తన మనసుకి ఎవరైనా దగ్గరైతే వారిని ఏదో ఒక బంధం తో పిలుస్తుందట. ఇక హను రాఘవ పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉందట.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు.

First Published:  20 Dec 2018 2:53 AM GMT
Next Story