Telugu Global
National

నీ దగ్గర విద్యాబాలన్‌ ఉంటే... నా దగ్గర ... బాలకృష్ణకు సవాల్‌ చేస్తూ వర్మ ట్వీట్

బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌కు, వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మధ్య వార్ మొదలైంది. శుక్రవారం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్ ఆడియో లాంచ్ జరగనుంది. అదే రోజు ఆర్‌జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించిన వెన్నుపోటు పాటను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందన్న చర్చ జరుగుతోంది. ఇంతలో వర్మ ట్విట్టర్ ద్వారా బాలకృష్ణపై ఘాటుగా ట్వీట్ చేశారు. బాలకృష్ణ తనను ప్రశ్నిస్తున్నట్టుగా మిమిక్రీ చేయించిన వర్మ… బాలకృష్ణ గొంతుతో సంధించిన ప్రశ్నలకు […]

నీ దగ్గర విద్యాబాలన్‌ ఉంటే... నా దగ్గర ... బాలకృష్ణకు సవాల్‌ చేస్తూ వర్మ ట్వీట్
X

బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌కు, వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మధ్య వార్ మొదలైంది. శుక్రవారం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్ ఆడియో లాంచ్ జరగనుంది. అదే రోజు ఆర్‌జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించిన వెన్నుపోటు పాటను విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందన్న చర్చ జరుగుతోంది. ఇంతలో వర్మ ట్విట్టర్ ద్వారా బాలకృష్ణపై ఘాటుగా ట్వీట్ చేశారు. బాలకృష్ణ తనను ప్రశ్నిస్తున్నట్టుగా మిమిక్రీ చేయించిన వర్మ… బాలకృష్ణ గొంతుతో సంధించిన ప్రశ్నలకు తానే తిరిగి సమాధానం చెప్పారు.

వర్మ విడుదల చేసిన ఆడియో టేపులో బాలకృష్ణ గొంతు ఇలా ప్రశ్నించింది. ”ఓరేయ్ ఆర్‌జీవీ. నా దగ్గర నేనున్నాను, విద్యా బాలన్‌ ఉంది, కల్యాణ్‌ రామ్ ఉన్నాడు, దగ్గుబాటి రానా ఉన్నాడు, సుమంత్ అక్కినేని ఉన్నాడు, నిత్యామీనన్ ఉంది, హన్సిక ఉంది, రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఉంది‌, శాలిని పాండే ఉంది, ప్రకాశ్‌ రాజ్‌ ఉన్నాడు. మరి నీ సినిమాలో ఏముంది రా?.” అని బాలకృష్ణ ప్రశ్నించినట్టుగా మిమిక్రీ చేయించారు.

బాలకృష్ణ గొంతును మిమిక్రీ చేస్తూ సంధించిన ప్రశ్నలకు వర్మ తన సొంత వాయిస్‌తో సమాధానం ఇచ్చారు. ” సార్‌.. నా దగ్గర నిజం ఉంది. నిజానికి సంబంధించిన సత్యం ఉంది. సత్యాన్ని తలదన్నే యదార్థం ఉంది. అది హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌లోని సంఘటనలు అవ్వొచ్చు, ఇంట్లోనూ, వంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలు అవ్వొచ్చు…. సార్‌ నిజం నాకన్నా ఎక్కువ మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఇంటల్లుడికి తెలుసు సార్…. కానీ మీరు చెప్పరు కాబట్టి నేను చెప్పాల్సివస్తోంది. యస్‌… నా దగ్గర మీ సినిమాలో ఉన్న స్టార్స్ లేరు. కానీ మీ సినిమాలో ఉన్న స్టార్స్‌ ఎవ్వరికీ మీ సినిమాలో ఉన్న అబద్దాలు తెలియవు. కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాలో ఉన్న యాక్టర్స్‌ అందరికీ నిజంగా జరిగిన నిజాలు మాత్రమే తెలుసు. సత్యమేవ జయతే. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాట డిసెంబర్‌ 21 సాయంత్రం 4 గంటలకి విడుదల” అంటూ వర్మ ముగించారు.

First Published:  20 Dec 2018 10:28 AM GMT
Next Story