Telugu Global
NEWS

జగన్‌ మీద గౌరవంతోనే 21న బాలకృష్ణ ఆడియో రిలీజ్ చేస్తున్నారా?

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీ’స్‌ ఎన్టీఆర్‌ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. అదే రోజు వైఎస్‌ జగన్ పుట్టిన రోజు కూడా. దీంతో లక్ష్మీ’స్‌ ఎన్టీఆర్‌ వెనుక వైసీపీ హస్తముందని అందుకే జగన్‌ పుట్టిన రోజే వర్మ … తన చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను విడుదల చేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే అంశంపై ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని మీడియా సమావేశంలో విలేకర్లు ప్రశ్నించారు. ఇందుకు […]

జగన్‌ మీద గౌరవంతోనే 21న బాలకృష్ణ ఆడియో రిలీజ్ చేస్తున్నారా?
X

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీ’స్‌ ఎన్టీఆర్‌ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. అదే రోజు వైఎస్‌ జగన్ పుట్టిన రోజు కూడా.

దీంతో లక్ష్మీ’స్‌ ఎన్టీఆర్‌ వెనుక వైసీపీ హస్తముందని అందుకే జగన్‌ పుట్టిన రోజే వర్మ … తన చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను విడుదల చేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది.

ఇదే అంశంపై ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని మీడియా సమావేశంలో విలేకర్లు ప్రశ్నించారు. ఇందుకు లక్ష్మీపార్వతి సమాధానం ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంలో వెన్నుపోటు సాంగ్‌ సంగతి అలా ఉంచుదాం… మరి అదే రోజు బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్ ఆడియో లాంచ్ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

బాలకృష్ణ కూడా వైఎస్‌ జగన్‌ మీద గౌరవంతో ఆయన పుట్టిన రోజు నాడు ఆడియో విడుదల చేస్తున్నారా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేయడంలో ముందుండే టీడీపీ నేతలు… ఆ తరహాలోనే ఇప్పుడు లక్ష్మీ’స్ ఎన్టీఆర్‌ చిత్రానికి… జగన్‌కు లింక్‌ పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ ఏమీ చంద్రబాబులాగా సినిమా వాళ్ల మీద ఆధారపడి రాజకీయాలు చేసే వ్యక్తి కాదన్నారు.

నందమూరి రాజకీయ ఆస్తిని… నారా కుటుంబం అనుభవిస్తోందన్నారు. బాలకృష్ణ ఏమీ తెలియని వ్యక్తి కాబట్టే ఒక ఎమ్మెల్యే పదవి విసిరేయగానే… ఎగురుకుంటూ గంతులేస్తున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. నెలకు 10 లక్షలు ఇచ్చి ట్యూషన్‌ పెట్టి నేర్పినా భాష కూడా నేర్చుకోలేకపోతున్న లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

First Published:  20 Dec 2018 6:16 AM GMT
Next Story