Telugu Global
NEWS

భువనేశ్వరి ఈ నాలుగేళ్లలోనే 14 వందల కోట్లు ఎలా సంపాదించారు?

గుట్టుగా కాపురం చేసుకునే సుహాసినిని తీసుకొచ్చి కూకట్‌పల్లిలో నిలబెట్టి ఓడించిన వ్యక్తి చంద్రబాబు అని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాన్ని తెలుసుకున్నారు కాబట్టే కూకట్‌పల్లిలో అక్క తరపున ప్రచారం చేసేందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రాలేదన్నారు. ఎన్నికల తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా చంద్రబాబు స్పందించలేదని సుహాసిని బాధపడడం చూసి తనకు కన్నీరు వచ్చిందన్నారు. సుహాసినిని బలి పశువును చేస్తున్నారని…. ఆమె గెలిచే అవకాశం లేదని ఆ రోజే తాను హెచ్చరించానన్నారు. చంద్రబాబు అంతటి నీచ […]

భువనేశ్వరి ఈ నాలుగేళ్లలోనే 14 వందల కోట్లు ఎలా సంపాదించారు?
X

గుట్టుగా కాపురం చేసుకునే సుహాసినిని తీసుకొచ్చి కూకట్‌పల్లిలో నిలబెట్టి ఓడించిన వ్యక్తి చంద్రబాబు అని లక్ష్మీపార్వతి అన్నారు.

చంద్రబాబు నీచ రాజకీయాన్ని తెలుసుకున్నారు కాబట్టే కూకట్‌పల్లిలో అక్క తరపున ప్రచారం చేసేందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రాలేదన్నారు.

ఎన్నికల తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా చంద్రబాబు స్పందించలేదని సుహాసిని బాధపడడం చూసి తనకు కన్నీరు వచ్చిందన్నారు. సుహాసినిని బలి పశువును చేస్తున్నారని…. ఆమె గెలిచే అవకాశం లేదని ఆ రోజే తాను హెచ్చరించానన్నారు.

చంద్రబాబు అంతటి నీచ నికృష్టమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే లేరన్నారు. వ్యవస్థలను నాశనం చేస్తూ… అనుకూల జడ్జీల ద్వారా నాట్‌ బిఫోర్‌ నాటకాలు ఆడుతూ కేసుల నుంచి తప్పించుకుంటున్న చంద్రబాబు ఈ సమాజానికి ఎంతవరకు అవసరమో ప్రజలే ఆలోచన చేయాలన్నారు.

అడవిలో ఉండాల్సిన చంద్రబాబును అధికారంలోకి కూర్చోబెట్టారు కాబట్టే సర్వవ్యవస్థలు నాశనం అయిపోయాయన్నారు. చంద్రబాబు అనుభవం అంతా ఆరు లక్షల కోట్లు దోచుకోవడానికి పనికొచ్చిందన్నారు. భువనేశ్వరి ఈ నాలుగేళ్లలోనే 14 వందల కోట్లు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు.

First Published:  20 Dec 2018 6:35 AM GMT
Next Story