Telugu Global
NEWS

దెయ్యాలు పింఛన్లు తీసుకునేవి....

ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవని.. ఇప్పుడు దెయ్యాలు శ్మశానంలో ఉన్నాయి.. మనుషులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని పాడిపేటలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ఈ మధ్యాహ్నం బహిరంగ సభలో మాట్లాడారు. మీ కొడుకులు మిమ్మల్ని చూసుకోకున్నా ఫర్వాలేదని.. ఇంటి పెద్ద కొడుకుగా తాను ఉంటానని.. ప్రతినెల డబ్బులు ఠంచనుగా ఇస్తానని చంద్రబాబు వృద్ధులకు భరోసానిచ్చారు. ఏపీలో అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలను కోరారు. ఏపీలో […]

దెయ్యాలు పింఛన్లు తీసుకునేవి....
X

ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవని.. ఇప్పుడు దెయ్యాలు శ్మశానంలో ఉన్నాయి.. మనుషులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని పాడిపేటలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ఈ మధ్యాహ్నం బహిరంగ సభలో మాట్లాడారు. మీ కొడుకులు మిమ్మల్ని చూసుకోకున్నా ఫర్వాలేదని.. ఇంటి పెద్ద కొడుకుగా తాను ఉంటానని.. ప్రతినెల డబ్బులు ఠంచనుగా ఇస్తానని చంద్రబాబు వృద్ధులకు భరోసానిచ్చారు. ఏపీలో అభివృద్ధి కొనసాగాలంటే టీడీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలను కోరారు.

ఏపీలో ఎక్కడా బోగస్ లేదని…. ఏ స్థలంలో…. ఎక్కడ పింఛన్ ఇచ్చారన్నది కంప్యూటర్ లో…. ఆన్ లైన్ లో చూసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు పింఛన్లు ఇచ్చే క్రమంలో దెయ్యాలు, పింఛన్లు అనడంపై దుమారం రేగింది. పేదలు చనిపోయినా వారిపై ఆధారపడ్డ వారు పింఛన్ తీసుకొని కుటుంబాన్ని పోషించారు. ఇప్పుడు వారిని దెయ్యాలు అనడంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలకు ఎంతో సాయం చేశానని చెబుతున్న చంద్రబాబు ఏపీలో ఎంతమందికి పింఛన్లు ఇచ్చారో చెప్పాలని…. ఎంత మందికి ఇయ్యలేదో తాము చెబుతామని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

మరోవైపు చంద్రబాబు ఎన్నికల వేళ అభివృద్ధి పనులను ఉరకలెత్తిస్తున్నారు. ఎన్టీఆర్ గృహాల పేరిట కట్టిన ఇళ్లను పేదలకు పంచుతున్నారు. ఈ కోవలోనే తిరుపతిలో ఈరోజు పేదలకు గృహాలను పంచారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బాబు చేస్తున్న హడావుడి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి.

First Published:  20 Dec 2018 5:50 AM GMT
Next Story