Telugu Global
NEWS

ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం మత్తులో ఉండగానే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లి అక్కడి ప్రతిపక్షాలను చావు దెబ్బతీశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేయబోతున్నారు. వైసీపీ కంటే ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా 10వేల మంది స్థానిక నాయకులు, కార్యకర్తలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు….  ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈసారి ముందస్తుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని చంద్రబాబు వివరించారు. సంక్రాంతి తర్వాత 60 నుంచి 70 […]

ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం మత్తులో ఉండగానే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లి అక్కడి ప్రతిపక్షాలను చావు దెబ్బతీశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేయబోతున్నారు.

వైసీపీ కంటే ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా 10వేల మంది స్థానిక నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు…. ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈసారి ముందస్తుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని చంద్రబాబు వివరించారు. సంక్రాంతి తర్వాత 60 నుంచి 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని పరోక్షంగా చంద్రబాబు వెల్లడించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఇక ఉపేక్షించవద్దని… ఎక్కడికక్కడ ఎదురుదాడి చేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పార్టీలోని అన్నివిభాగాలు ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

ప్రతిపక్షం అందుకోలేనంత వేగంగా పార్టీ యంత్రాంగం పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదును వెంటనే పూర్తి చేయాలని… ఇకపై దాన్ని సాగదీయవద్దని ఆదేశించారు.

పార్టీ సభ్యత్వం త్వరగా పూర్తి చేస్తే దృష్టిసారించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతి గంట విలువైనదిగానే తీసుకోవాలని ఆదేశించారు. బూత్‌ కన్వీనర్ల ఎంపిక త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇకపై ప్రతివారం … పదివేల మంది స్థానిక నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

First Published:  19 Dec 2018 11:39 PM GMT
Next Story