Telugu Global
NEWS

30 కోట్లు తీసుకురండి.... టీడీపీ టికెట్ ఇప్పిస్తా....

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులుంటేనే టికెట్ అని పరోక్షంగా తేల్చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ అసెంబ్లీ టికెట్ కావాలంటే రూ. 30 కోట్లు తీసుకు రావాలని సూచించారు. ప్రొద్దుటూరులో బీసీ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వరదరాజుల రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నందున ఈసారి టీడీపీ టికెట్ బీసీ అభ్యర్థికి వచ్చేలా చూడాలని…. అప్పుడు బీసీలందరూ వరదరాజుల రెడ్డికి అండగా ఉంటామని బీసీ నాయకులు […]

30 కోట్లు తీసుకురండి.... టీడీపీ టికెట్ ఇప్పిస్తా....
X

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులుంటేనే టికెట్ అని పరోక్షంగా తేల్చేశారు. ప్రొద్దుటూరు టీడీపీ అసెంబ్లీ టికెట్ కావాలంటే రూ. 30 కోట్లు తీసుకు రావాలని సూచించారు. ప్రొద్దుటూరులో బీసీ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వరదరాజుల రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రొద్దుటూరులో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నందున ఈసారి టీడీపీ టికెట్ బీసీ అభ్యర్థికి వచ్చేలా చూడాలని…. అప్పుడు బీసీలందరూ వరదరాజుల రెడ్డికి అండగా ఉంటామని బీసీ నాయకులు వ్యాఖ్యానించారు.

ఇందుకు స్పందించిన వరదరాజుల రెడ్డి బీసీలకు ప్రొద్దుటూరు టికెట్ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాను ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని… ఆరోసారి ఎమ్మెల్యే అయినా, కాకపోయినా వచ్చిన నష్టం తనకేమీ లేదన్నారు.

కాకపోతే టికెట్‌ కోసం ఉత్సాహం చూపుతున్న వారు రూ. 30 కోట్ల ఖర్చు పెట్టేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. రూ. 30 కోట్లు ఖర్చు పెట్టే ఏ బీసీ వ్యక్తి ఉన్నా ముందుకు రావాలని టికెట్‌ ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో బీసీ నాయకులు మౌనంగా ఉండిపోయారు.

First Published:  19 Dec 2018 2:14 AM GMT
Next Story