Telugu Global
Cinema & Entertainment

కొరటాల శివ, చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సై రా” నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి…. బోయపాటి శ్రీను, వినాయక్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులతో పనిచేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా కొరటాల శివ రాసుకొచ్చిన ఒక సోషల్ మెసేజ్ కథ విన్న చిరంజీవి… […]

కొరటాల శివ, చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్
X

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సై రా” నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి…. బోయపాటి శ్రీను, వినాయక్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులతో పనిచేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా కొరటాల శివ రాసుకొచ్చిన ఒక సోషల్ మెసేజ్ కథ విన్న చిరంజీవి… కొరటాల శివ కి అవకాశం ఇచ్చాడు.

పూర్తీ స్థాయి వ్యవసాయ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఇలాంటి సినిమాలో ఒక స్టార్ హీరో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుంది అని కొరటాల శివ చిరజీవింకి చెప్పాడట. దీంతో ఈ రోల్ ని రామ్ చరణ్ తో చేయించాలి అని చిరంజీవి ప్లాన్ చేశాడట.

ఇక ఈ సినిమా నిర్మాతగా కూడా రామ్ చరణే వ్యవహరిస్తున్నాడు. “సై రా” సినిమా షూటింగ్ నుంచి చిరంజీవి ఫ్రీ అవ్వగానే కొరటాల శివ సినిమా పనులు స్టార్ట్ చేస్తాడట రామ్ చరణ్.

First Published:  19 Dec 2018 12:44 AM GMT
Next Story