Telugu Global
Cinema & Entertainment

ఈ సినిమాలో 'RX 100' భామ క్యారెక్టర్ ఇదేనట

“RX100” సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా తరువాత పాయల్ రాజ్ పుత్ కి ఇటు తెలుగు నుంచి, అటు తమిళ్ నుంచి ఆఫర్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం చాలా జాగ్రత్తగా కథలు సెలెక్ట్ చేసుకొని మరీ సినిమాలకి సైన్ చేస్తోందట. ఇటీవలే తన క్యారెక్టర్ , కథ నచ్చి పాయల్ రాజ్ పుత్ రవితేజ తో కలిసి నటించడానికి ఒప్పుకుందట. వి.ఐ […]

ఈ సినిమాలో RX 100 భామ క్యారెక్టర్ ఇదేనట
X

“RX100” సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా తరువాత పాయల్ రాజ్ పుత్ కి ఇటు తెలుగు నుంచి, అటు తమిళ్ నుంచి ఆఫర్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం చాలా జాగ్రత్తగా కథలు సెలెక్ట్ చేసుకొని మరీ సినిమాలకి సైన్ చేస్తోందట.

ఇటీవలే తన క్యారెక్టర్ , కథ నచ్చి పాయల్ రాజ్ పుత్ రవితేజ తో కలిసి నటించడానికి ఒప్పుకుందట. వి.ఐ ఆనంద్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ అంధురాలిగా, చెవిటి తనంతో బాధపడుతున్న క్యారెక్టర్ లో నటిస్తోందట.

కథలో భాగంగా పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ ని ఆ రేంజ్ లో డిజైన్ చేశాడట దర్శకుడు ఆనంద్. ఇక పాయల్ రాజ్ పుత్ కూడా ఈ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని తన పాత్ర కోసం ఇప్పటి నుంచే కష్టపడుతుందట.

పాయల్ రాజ్ పుత్ తో పాటు నాబా నటేష్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. “డిస్కో రాజా” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమాని ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  18 Dec 2018 9:09 PM GMT
Next Story