Telugu Global
Cinema & Entertainment

బాలయ్య-బోయపాటి సినిమా ఫిక్స్?

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు బాలకృష్ణ. 10 రోజుల షూటింగ్ మినహా ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు బాలయ్య. అది కూడా తన సొంత బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్ పై ఈ సినిమా రాబోతోంది. బాలయ్య-బోయపాటి కాంబోలో ఇప్పటికే 2 సినిమాలొచ్చాయి. ఆ రెండూ పెద్ద హిట్స్ అయ్యాయి. ఇక హ్యాట్రిక్ మూవీగా మరో […]

బాలయ్య-బోయపాటి సినిమా ఫిక్స్?
X

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు బాలకృష్ణ. 10 రోజుల షూటింగ్ మినహా ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు బాలయ్య. అది కూడా తన సొంత బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్ పై ఈ సినిమా రాబోతోంది.

బాలయ్య-బోయపాటి కాంబోలో ఇప్పటికే 2 సినిమాలొచ్చాయి. ఆ రెండూ పెద్ద హిట్స్ అయ్యాయి. ఇక హ్యాట్రిక్ మూవీగా మరో సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ డేట్స్ సెట్ అవ్వలేదు. ఇతర హీరోల సినిమాలతో బోయపాటి, ఇతర దర్శకుల మూవీస్ తో బాలయ్య బిజీ అయ్యారు. ఎట్టకేలకు వినయ విధేయ రామ సినిమాను పూర్తిచేసిన బోయపాటి, ఫిబ్రవరి నుంచి బాలయ్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. హీరోయిన్, టెక్నీషియన్స్ ను ఫిక్స్ చేసి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. ఏపీలో ఎన్నికల సమయానికి ఈ సినిమాను థియేటర్లలోకి వదలాలనేది ప్లాన్.

First Published:  18 Dec 2018 9:00 PM GMT
Next Story