Telugu Global
Cinema & Entertainment

అవును... అవి నిజాలు కావు

ఇండస్ట్రీ లో పెళ్ళి టాపిక్ ఎత్తితే మనకి ఎక్కువగా వినిపించే హీరో పేరు ప్రభాస్.  నలబై ఏళ్ళు వచ్చినా కూడా సినిమాలతో బిజీగా ఉంటూ పెళ్ళి గురించి ఆలోచించట్లేదు ప్రభాస్. కానీ ప్రభాస్ అనుష్క ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అని, త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ బయట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ అనుష్క రిలేషన్ షిప్ పై మరో వార్త బయటకు వచ్చింది. తాజాగా ప్రభాస్, రాజమౌళి, రానా […]

అవును... అవి నిజాలు కావు
X

ఇండస్ట్రీ లో పెళ్ళి టాపిక్ ఎత్తితే మనకి ఎక్కువగా వినిపించే హీరో పేరు ప్రభాస్. నలబై ఏళ్ళు వచ్చినా కూడా సినిమాలతో బిజీగా ఉంటూ పెళ్ళి గురించి ఆలోచించట్లేదు ప్రభాస్. కానీ ప్రభాస్ అనుష్క ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అని, త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ బయట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ అనుష్క రిలేషన్ షిప్ పై మరో వార్త బయటకు వచ్చింది.

తాజాగా ప్రభాస్, రాజమౌళి, రానా లు కాఫీ విత్ కరణ్ అనే షోకి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అక్కడ ప్రభాస్ ను కరణ్ జోహార్ ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు, అనుష్క డేటింగ్ లో ఉన్నారట కదా నిజమేనా అని…. దానికి ప్రభాస్ అటువంటిది ఏమి లేదని అన్నాడు.

కానీ షో చివర్లో మాత్రం ఈ షో లో మీరేమైనా అబద్దాలు చెప్పారా అని కరణ్ జోహార్ అడిగితే అవును అని నవ్వుతు సమాధానం ఇచ్చాడు ప్రభాస్. అంటే ఆ అబద్దం అనుష్కతో డేటింగ్ రూమర్ గురించా లేకపోతే మరేదైనా అనేది ప్రభాస్ కి మాత్రమే తెలియాలి. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

First Published:  18 Dec 2018 4:35 AM GMT
Next Story