Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ గెస్ట్‌హస్‌ కేసు నేటిది కాదు....

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్…. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అలాంటి ఒక స్టార్ ఇల్లుని రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. అసలు విషయంలోకి వెళ్తే…. హైదరాబాద్ లో రాయదుర్గంలోని గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ 46లో ఉన్న 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించిన కేసు 40 ఏళ్లుగా కోర్టులో నడుస్తోంది. ఇన్నాళ్ళకు ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. దాంతో శేరిలింగంపల్లి తహసీల్దారు వాసు చంద్ర ఆధ్వర్యంలో ఆ స్థలంలో […]

ప్రభాస్ గెస్ట్‌హస్‌ కేసు నేటిది కాదు....
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్…. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అలాంటి ఒక స్టార్ ఇల్లుని రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు.

అసలు విషయంలోకి వెళ్తే…. హైదరాబాద్ లో రాయదుర్గంలోని గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ 46లో ఉన్న 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించిన కేసు 40 ఏళ్లుగా కోర్టులో నడుస్తోంది. ఇన్నాళ్ళకు ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది.

దాంతో శేరిలింగంపల్లి తహసీల్దారు వాసు చంద్ర ఆధ్వర్యంలో ఆ స్థలంలో ఉన్న కొన్ని ఇళ్ళని తొలగించిందేకు అధికారులు సిద్దమయ్యారు. ఆ స్థలంలో ప్రభాస్ గెస్ట్‌హస్‌ ఉండడంతో దాన్ని కూడా సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు అధికారుల పై సోషల్ మీడియా లో నెగటివ్ పోస్టులు పెడుతూ హల్‌ చల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో లేడని చెబుతున్నారు. వచ్చాక అధికారులను ప్రభాస్‌ సంప్రదించే అవకాశం ఉంది.

First Published:  18 Dec 2018 2:37 AM GMT
Next Story