Telugu Global
Cinema & Entertainment

సూర్యకాంతంగా మారిన నిహారిక

నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా తెర‌కెక్కుతున్న ఎంట‌ర్ టైన‌ర్ సూర్యకాంతం. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను నిహారిక అన్నయ్య వ‌రుణ్ తేజ్ లాంచ్ చేసాడు. ఈ రోజు నిహారిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ లుక్  విడుద‌ల చేసారు. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ఈ రొమాంటిక్ ఎంటర్ టైన‌ర్ ను తెర‌కెక్కిస్తున్నాడు. ప్రణీత గ‌తంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసారు.. నిహారిక‌తో వెబ్ సిరీస్ కూడా తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ లుక్ లో ఓ వైపు ప్రేమ […]

సూర్యకాంతంగా మారిన నిహారిక
X

నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా తెర‌కెక్కుతున్న ఎంట‌ర్ టైన‌ర్ సూర్యకాంతం. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను నిహారిక అన్నయ్య వ‌రుణ్ తేజ్ లాంచ్ చేసాడు. ఈ రోజు నిహారిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ లుక్ విడుద‌ల చేసారు. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ఈ రొమాంటిక్ ఎంటర్ టైన‌ర్ ను తెర‌కెక్కిస్తున్నాడు.

ప్రణీత గ‌తంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసారు.. నిహారిక‌తో వెబ్ సిరీస్ కూడా తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ లుక్ లో ఓ వైపు ప్రేమ చూపిస్తూనే.. మ‌రోవైపు గొడ‌వ ప‌డుతున్నారు నిహారిక‌, రాహుల్. ఈ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సూర్యకాంతం షూటింగ్ పూర్తయి పోయింది… ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ చిత్రంలో శివాజీ రాజా, సుహాసిని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌ముఖ యుఎస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వ‌రుణ్ తేజ్ సూర్యకాంతం సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరిస్తున్నాడు.

First Published:  18 Dec 2018 5:50 AM GMT
Next Story