Telugu Global
NEWS

ఐపీఎల్ -12 వేలంలో ఉనద్కత్ కే మళ్లీ జాక్ పాట్

8 కోట్ల 50 లక్షల ధరకు రాజస్థాన్ రాయల్స్ కు దక్కిన ఉనద్కత్ బ్రాత్ వెయిట్, అక్షర్ పటేల్ లకు చెరో 5 కోట్ల జాక్ పాట్ షమీకి 4 కోట్ల 80 లక్షలు, విహారికి 2 కోట్ల వేలం ధర యువరాజ్, పూజారాలను పట్టించుకోని ఫ్రాంచైజీలు ఐపీఎల్ 12వ సీజన్ వేలం…జైపూర్ వేదికగా…సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం…భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 8 […]

ఐపీఎల్ -12 వేలంలో ఉనద్కత్ కే మళ్లీ జాక్ పాట్
X
  • 8 కోట్ల 50 లక్షల ధరకు రాజస్థాన్ రాయల్స్ కు దక్కిన ఉనద్కత్
  • బ్రాత్ వెయిట్, అక్షర్ పటేల్ లకు చెరో 5 కోట్ల జాక్ పాట్
  • షమీకి 4 కోట్ల 80 లక్షలు, విహారికి 2 కోట్ల వేలం ధర
  • యువరాజ్, పూజారాలను పట్టించుకోని ఫ్రాంచైజీలు

ఐపీఎల్ 12వ సీజన్ వేలం…జైపూర్ వేదికగా…సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం…భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో… రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకొంది.

కోటీ 50 లక్షల కనీస ధరతో ప్రారంభమైన ఉనద్కత్ వేలం చివరకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో ముగిసింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని… రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 4 కోట్ల 80 లక్షల రూపాయల ధరకు దక్కించుకొంది.

జయదేవ్ ఉనద్కత్
మహ్మద్ షమీ

లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కోటీ 10 లక్షల ధరకే ఢిల్లీ జట్టులో చేరాడు.

ఇశాంత్ శర్మ

టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారిని…ఢిల్లీ ఫ్రాంచైజీ 2 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకొంది.

హనుమ విహారి
అక్షర్ పటేల్

వెస్టిండీస్ టీ-20 కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వెయిట్, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లకు సైతం…చెరో 5 కోట్ల రూపాయలు చొప్పున ధర పలికింది.

యువరాజ్ సింగ్

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పూజారాలను సొంతం చేసుకోడానికి… ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోడం విశేషం.

చతేశ్వర్ పూజారా
First Published:  18 Dec 2018 7:02 AM GMT
Next Story