Telugu Global
NEWS

కోర్టు తీర్పుపై భానుమతి స్పందన

భాను కిరణ్‌ విశ్వాస ఘాతకుడని గంగుల భానుమతి వ్యాఖ్యానించారు. తన భర్త సూరి హత్య కేసులో భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబ సభ్యుల పైనా విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. పరిటాల సునీత కుటుంబమే భాను కిరణ్‌కు సుపారీ ఇచ్చి తన భర్త సూరిని హత్య చేయించిందని భానుమతి ఆరోపించారు. కోర్టు తీర్పును తాము స్వాగిస్తున్నామని  చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే […]

కోర్టు తీర్పుపై భానుమతి స్పందన
X

భాను కిరణ్‌ విశ్వాస ఘాతకుడని గంగుల భానుమతి వ్యాఖ్యానించారు. తన భర్త సూరి హత్య కేసులో భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

పరిటాల కుటుంబ సభ్యుల పైనా విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. పరిటాల సునీత కుటుంబమే భాను కిరణ్‌కు సుపారీ ఇచ్చి తన భర్త సూరిని హత్య చేయించిందని భానుమతి ఆరోపించారు.

కోర్టు తీర్పును తాము స్వాగిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే ఇంకా సంతోషించే వాళ్లమని చెప్పారు. సూరి పేరు చెప్పి భానుకిరణ్‌ కోట్ల రూపాయల సెటిల్‌మెంట్లు చేసుకున్నారని భానుమతి ఆరోపించారు.

First Published:  18 Dec 2018 8:30 AM GMT
Next Story