Telugu Global
NEWS

కోర్టులో తల్లి సెంటిమెంట్ వినిపించిన భాను....

మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. కేసులో పక్కా ఆధారాలు ఉండడంతో భాను తప్పించుకోలేక పోయాడు. భాను ప్రధాన అనుచరుడు మన్మోహన్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే కఠిన శిక్ష నుంచి తప్పించుకునేందుకు భాను కిరణ్‌ కోర్టులో తల్లి సెంటిమెంట్‌ను ప్రయోగించాడు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని.. కాబట్టి తనకు కఠిన శిక్ష వేయవద్దని కోరారు. కానీ భాను నేర చరిత్ర, నేర […]

కోర్టులో తల్లి సెంటిమెంట్ వినిపించిన భాను....
X

మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. కేసులో పక్కా ఆధారాలు ఉండడంతో భాను తప్పించుకోలేక పోయాడు.

భాను ప్రధాన అనుచరుడు మన్మోహన్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే కఠిన శిక్ష నుంచి తప్పించుకునేందుకు భాను కిరణ్‌ కోర్టులో తల్లి సెంటిమెంట్‌ను ప్రయోగించాడు.

తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని.. కాబట్టి తనకు కఠిన శిక్ష వేయవద్దని కోరారు. కానీ భాను నేర చరిత్ర, నేర ప్రవృత్తితో పాటు హత్య కేసులో పక్కా ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు భాను కిరణ్‌ వినతిని తిరస్కరించింది. యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

ఆయుధ చట్టం కింద మరో ఐదేళ్ల శిక్షను భానుకు కోర్టు విధించింది. హత్య కేసుతో పాటు…. ఆయుధ చట్టం కింద మన్మోహన్‌కు కూడా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి.

First Published:  18 Dec 2018 5:45 AM GMT
Next Story