Telugu Global
Cinema & Entertainment

గాయాలపాలైన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం కాకినాడ లో “డియర్ కామ్రేడ్” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అక్కడ కొన్ని ముఖ్య సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు మూవీ యూనిట్. అయితే ఈ షూటింగ్ లో విజయ్ దేవరకొండ ట్రైన్ లో నుంచి కిందకి దూకే సన్నివేశం ని షూట్ చేస్తున్నారుట…  అక్కడ ఒక చిన్న పొరపాటు జరగడం వల్ల విజయ్ దేవరకొండ ట్రైన్ లో నుంచి కింద పడి గాయపడ్డాడు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఇన్ […]

గాయాలపాలైన విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ ప్రస్తుతం కాకినాడ లో “డియర్ కామ్రేడ్” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అక్కడ కొన్ని ముఖ్య సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు మూవీ యూనిట్.

అయితే ఈ షూటింగ్ లో విజయ్ దేవరకొండ ట్రైన్ లో నుంచి కిందకి దూకే సన్నివేశం ని షూట్ చేస్తున్నారుట… అక్కడ ఒక చిన్న పొరపాటు జరగడం వల్ల విజయ్ దేవరకొండ ట్రైన్ లో నుంచి కింద పడి గాయపడ్డాడు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రాంలో మెసేజ్ చేశాడు.

తగిలిన గాయం ఫొటో పెట్టి ప్రతి దెబ్బని మనం ఆస్వాదించాలి, జీవితం లో ఏదీ ఊరికే రాదు అని చెప్పుకొచ్చాడు విజయ్. విజయ్ కి పెద్దగా దెబ్బలు తాకక పోవడంతో మళ్ళీ యధావిధంగా షూటింగ్ ని కంటిన్యూ చేసారు మూవీ యూనిట్.

భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ “గీత గోవిందం” సినిమాలో నటించి హిట్ పెయిర్ గా నిలిచారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

First Published:  17 Dec 2018 2:40 AM GMT
Next Story