Telugu Global
Cinema & Entertainment

"వెంకీ మామ" ఆలస్యానికి కారణం సురేష్ బాబేనట....

నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటిస్తోన్న సినిమా “వెంకీ మామ”. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ కి నోచుకోలేదు ఈ సినిమా. కారణం సురేష్ బాబేనట. ఈ కథ పై, ఇందులోని సీన్స్ పై ఇంకా క్లారిటీ రాలేదట. ప్రతి సినిమా క‌థ‌లో సురేష్ బాబు ఇన్‌వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కాక‌పోతే […]

వెంకీ మామ  ఆలస్యానికి కారణం సురేష్ బాబేనట....
X

నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటిస్తోన్న సినిమా “వెంకీ మామ”. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది.

సినిమా స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ కి నోచుకోలేదు ఈ సినిమా. కారణం సురేష్ బాబేనట. ఈ కథ పై, ఇందులోని సీన్స్ పై ఇంకా క్లారిటీ రాలేదట. ప్రతి సినిమా క‌థ‌లో సురేష్ బాబు ఇన్‌వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కాక‌పోతే ఈ సినిమా కోసం ఇంకొంచెం ఎక్కువ మార్పులు చెబుతున్నాడట సురేష్ బాబు.

ఇప్ప‌టికే దాదాపు ఏడెనిమిది సార్లు సినిమా కథలో మార్పులు చేర్పులు చేశారట. అయిన‌ప్ప‌టికీ సురేష్ బాబుకి నచ్చలేదట. ఒకవేళ పరిస్థితి గానీ ఇలాగే ఉంటే డైరెక్టర్ బాబీ ఖచ్చితంగా ఈ సినిమా నుంచి బయటకి వస్తాడనే చర్చ నడుస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబుతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

First Published:  17 Dec 2018 7:00 AM GMT
Next Story