Telugu Global
NEWS

తెలంగాణలో మరో రెండు జిల్లాలు, మరో రెండు మండలాలు

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే 57ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడంతోపాటు అర్హులను ఎంపిక చేయాలని సీఎస్ ను ఆదేశించారు. లబ్దిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్ లో దీనికి సంబంధించిన నిధులు కేటాయించి… ఏప్రిల్ మాసం నుంచి పెన్షన్లు అందించాలని చెప్పారు. ఇక గ్రామాభివృద్ధిపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి […]

తెలంగాణలో మరో రెండు జిల్లాలు, మరో రెండు మండలాలు
X

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే 57ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.

దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడంతోపాటు అర్హులను ఎంపిక చేయాలని సీఎస్ ను ఆదేశించారు. లబ్దిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్ లో దీనికి సంబంధించిన నిధులు కేటాయించి… ఏప్రిల్ మాసం నుంచి పెన్షన్లు అందించాలని చెప్పారు.

ఇక గ్రామాభివృద్ధిపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలని చెప్పారు. దీంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు.

వీటితోపాటు కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని…నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని ఆయన సూచించారు.

ఎన్నికల కోడ్ తో నిలిచిపోయిన బతుకమ్మ చీరలను ఈనెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ… కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

First Published:  16 Dec 2018 9:10 PM GMT
Next Story