Telugu Global
NEWS

సిక్కుల ఊచకోత కేసులో సంచలన తీర్పు.... కాంగ్రెస్‌ సీనియర్ నేతకు జీవిత ఖైదు

1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గతంలో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటించడంపై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. డిసెంబర్‌ 31లోగా లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. 1984లో ఇందిరా గాంధీని […]

సిక్కుల ఊచకోత కేసులో సంచలన తీర్పు.... కాంగ్రెస్‌ సీనియర్ నేతకు జీవిత ఖైదు
X

1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గతంలో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.

సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటించడంపై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. డిసెంబర్‌ 31లోగా లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది.

సజ్జన్‌ కుమార్‌

1984లో ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులుగా ఉన్న సిక్కు గన్‌మెన్లే కాల్చి చంపారు. దాంతో ఢిల్లీ పరిసరాల్లో అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. అందులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌, జగదీష్‌ టైట్లర్‌ తదితరులు కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు వచ్చాయి.

First Published:  17 Dec 2018 12:10 AM GMT
Next Story