Telugu Global
Cinema & Entertainment

శర్వా కోసం బన్నీ ఎంట్రీ

ప్రస్తుతం అల్లు అర్జున్ ఖాళీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. మరో సినిమా చేతిలో లేదు. దీంతో మిగతా హీరోల ఫంక్షన్లకు ప్రత్యేక అతిథిగా హాజరవుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే గీతగోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల ఫంక్షన్లకు హాజరైన బన్నీ, ఇప్పుడు మరో సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా వెళ్లబోతున్నాడు. శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు […]

శర్వా కోసం బన్నీ ఎంట్రీ
X

ప్రస్తుతం అల్లు అర్జున్ ఖాళీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. మరో సినిమా చేతిలో లేదు. దీంతో మిగతా హీరోల ఫంక్షన్లకు ప్రత్యేక అతిథిగా హాజరవుతూ టైమ్ పాస్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగా ఇప్పటికే గీతగోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల ఫంక్షన్లకు హాజరైన బన్నీ, ఇప్పుడు మరో సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా వెళ్లబోతున్నాడు.

శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరుకాబోతున్నాడు బన్నీ. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. శిల్పకళావేదికలో జరిగే ఈ వేడుకలో బన్నీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాడు.

నిజానికి ఈ సినిమా యూనిట్ కు, డైరక్టర్ కు బన్నీతో ఎలాంటి సంబంధాలు లేవు. కేవలం శర్వానంద్ కోసం మాత్రమే అల్లు అర్జున్ ఈ ఫంక్షన్ కు వస్తున్నాడు. మురళీ శర్మ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా, డిసెంబర్ 21న థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  15 Dec 2018 11:54 PM GMT
Next Story