Telugu Global
Cinema & Entertainment

షారుఖ్ కు అల్లు అర్జున్ నచ్చేశాడట....

సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుగు హీరోలు అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ ఒక తెలుగు స్టార్ హీరో అంటే ఇష్టం అని చెబుతున్నాడు. స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ అంటే షారుఖ్ ఖాన్ కి  చాలా ఇష్టమట. షారుఖ్ ఖాన్ లేటెస్ట్ సినిమా “జీరో”. ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా […]

షారుఖ్ కు అల్లు అర్జున్ నచ్చేశాడట....
X

సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుగు హీరోలు అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ ఒక తెలుగు స్టార్ హీరో అంటే ఇష్టం అని చెబుతున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే షారుఖ్ ఖాన్ కి చాలా ఇష్టమట.

షారుఖ్ ఖాన్ లేటెస్ట్ సినిమా “జీరో”. ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొని వచ్చాడు. అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి, నాకు అతని వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం… అలాగే చాలా టాలెంటెడ్ పర్సన్ కూడా…. నేను ఒక రోజు మొత్తం ఖాళీ చేసుకొని, ఆ రోజు ఏ పనులు పెట్టుకోకుండా కేవలం అల్లు అర్జున్ తో మాత్రమే టైం స్పెండ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు షారుఖ్ ఖాన్.

ఇక ఈ మాట షారుఖ్ ఖాన్ నోటి నుంచి రాగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ తెగ ఖుషి అయిపోతున్నారు.

First Published:  16 Dec 2018 2:35 AM GMT
Next Story