Telugu Global
Cinema & Entertainment

రెండు ఈవెంట్లు కలిపి ఒకేసారి

లెక్కప్రకారం ఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ ట్రయిలర్ రిలీజ్ కావాలి. ఇక 21వ తేదీన ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టాలి. కానీ ఇప్పుడీ రెండు కార్యక్రమాల్ని కలిపేశారు. ఈరోజు చేపట్టాల్సిన ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా 21న జరిగే ఆడియో ఫంక్షన్ లోనే కలిపేశారు. దీని వెనక ఓ గమ్మత్తైన రీజన్ ఉంది. 16న ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ 3 రోజుల కిందట గ్రాండ్ గా ప్రకటించారు. దానికి విపరీతమైన పబ్లిసిటీ ఆశించారు మేకర్స్. కానీ 16న […]

రెండు ఈవెంట్లు కలిపి ఒకేసారి
X

లెక్కప్రకారం ఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ ట్రయిలర్ రిలీజ్ కావాలి. ఇక 21వ తేదీన ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టాలి. కానీ ఇప్పుడీ రెండు కార్యక్రమాల్ని కలిపేశారు. ఈరోజు చేపట్టాల్సిన ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా 21న జరిగే ఆడియో ఫంక్షన్ లోనే కలిపేశారు. దీని వెనక ఓ గమ్మత్తైన రీజన్ ఉంది.

16న ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ 3 రోజుల కిందట గ్రాండ్ గా ప్రకటించారు. దానికి విపరీతమైన పబ్లిసిటీ ఆశించారు మేకర్స్. కానీ 16న ట్రయిలర్ రాబోతోందనే వార్త ఎందుకో జనాలకు పెద్దగా ఎక్కలేదు. చాలామంది పట్టించుకోలేదు కూడా. ఆశించిన స్థాయిలో బజ్ లేని కారణంగా ట్రయిలర్ రిలీజ్ కార్యక్రమాన్ని రద్దుచేశారు. ఆడియో రిలీజ్ లోనే ట్రయిలర్ రిలీజ్ ను కూడా కలిపేశారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇక రెండో భాగం ఎప్పుడొస్తుందనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. సెకెండ్ పార్ట్ కూడా జనవరిలోనే వస్తుందని గతంలో తేదీతో పాటు ప్రకటించినప్పటికీ, ఆ తేదీ నుంచి యూనిట్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

First Published:  16 Dec 2018 12:12 PM GMT
Next Story