Telugu Global
Cinema & Entertainment

ఇంకాస్త ఆలస్యంగా 'యాత్ర'

లెక్కప్రకారం ఈనెలలోనే థియేటర్లలోకి రావాలి. ఇది మిస్ అయితే సంక్రాంతికి గ్యారెంటీ అనుకున్నారు. కానీ యాత్ర సినిమా మరోసారి వాయిదాపడింది. ఏకంగా ఫిబ్రవరికి వెళ్లిపోయింది. అవును.. ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. దివంగత నేత వైఎస్ఆర్ అప్పట్లో చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది యాత్ర సినిమా. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేశారు. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైఎస్ […]

ఇంకాస్త ఆలస్యంగా యాత్ర
X

లెక్కప్రకారం ఈనెలలోనే థియేటర్లలోకి రావాలి. ఇది మిస్ అయితే సంక్రాంతికి గ్యారెంటీ అనుకున్నారు. కానీ యాత్ర సినిమా మరోసారి వాయిదాపడింది. ఏకంగా ఫిబ్రవరికి వెళ్లిపోయింది. అవును.. ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

దివంగత నేత వైఎస్ఆర్ అప్పట్లో చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది యాత్ర సినిమా. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేశారు. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.

వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా, క్రిస్మస్ సీజన్ కూడా కలిసొచ్చేలా డిసెంబర్ 21న విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతరిక్షం, పడిపడి లేచే మనసు సినిమాల రాకతో సోలో రిలీజ్ కోసం వాయిదా వేశారు.

ఒక దశలో సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా యాత్ర సినిమాను దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ తాము సంక్రాంతి బరిలో లేమనే విషయాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వచ్చారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరుకు యాత్ర వస్తుందని అంతా భావించారు. కానీ ఫిబ్రవరి 8వ తేదీని ఫిక్స్ చేశారు.

70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతోంది యాత్ర సినిమా. మూవీకి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ ప్రచారం ప్రారంభమైంది.

First Published:  15 Dec 2018 8:32 AM GMT
Next Story