Telugu Global
NEWS

ఆ స్థానాల్లో ఫలితం తారుమారు వెనుక అనుమానాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులు కొందరు అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు.  ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 171 ఓట్లతో గెలిచారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి మల్‌ రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇలా వెయ్యి లోపు మెజారిటీతో అభ్యర్థులు ఓడిన స్థానాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా తక్కువ మెజారిటీతో ఫలితం తారుమారు అయిన చోట్ల …. పోలైన ఓట్లకు… కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంల్లో […]

ఆ స్థానాల్లో ఫలితం తారుమారు వెనుక అనుమానాలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులు కొందరు అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు.

ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 171 ఓట్లతో గెలిచారు.

ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి మల్‌ రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఇలా వెయ్యి లోపు మెజారిటీతో అభ్యర్థులు ఓడిన స్థానాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా తక్కువ మెజారిటీతో ఫలితం తారుమారు అయిన చోట్ల …. పోలైన ఓట్లకు… కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంల్లో వచ్చిన మొత్తం ఓట్లకు పొంతన కుదరడం లేదు. దీంతో ఓడిపోయిన అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చాలా నియోజక వర్గాల్లో పోలైన ఓట్లకు… కౌంటింగ్ సమయంలో ఈవీఎంలలో చూపిన ఓట్లకు లెక్క కుదరడం లేదు. ఈ అంశంపై ఓడిన అభ్యర్థులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఇలా ఓట్లలో తేడా ఉండడంతోపాటు…. స్వల్ప మెజారిటీతో ఫలితం తారుమారైన నియోజకవర్గాలను గమనిస్తే…

  • ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 171 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
  • ఈసీ లెక్కల ప్రకారం ఇక్కడ పోలైన మొత్తం ఓట్ల సంఖ్య- లక్షా 60వేల 214
  • కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు చూపిన మొత్తం ఓట్ల సంఖ్య- లక్షా 60వేల 790
  • అంటే పోలైన ఓట్లకు… కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లకు మధ్య తేడా 576
  • 576 ఓట్లు తేడా ఉన్న చోట కేవలం 171 ఓట్ల మెజారిటీతోనే ఫలితం తారుమారైంది.

కోదాడ…

  • ఇక్కడ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి భార్య పద్మావతి కేవలం 756 ఓట్లతో ఓడిపోయారు.
  • ఈసీ లెక్కల ప్రకారం ఇక్కడ పోలైన మొత్తం ఓట్ల సంఖ్య- లక్షా 92వేల 8 ఓట్లు
  • కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు చూపిన మొత్తం ఓట్ల సంఖ్య- లక్షా 93 వేల 888 ఓట్లు
  • పోలైన ఓట్లకు… కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లకు మధ్య తేడా- 1880 ఓట్లు
  • 1880 ఓట్లు తేడా ఉన్న చోట కాంగ్రెస్ అభ్యర్థి 756 ఓట్లతో ఓడిపోవడంపై అనుమానాలు

తుంగతుర్తి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తుంగతుర్తిలో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో చూపిన ఓట్లకు మధ్య తేడా వెయ్యి 52 ఓట్లు తేడా ఉన్నాయి. ఇక్కడ ఫలితం కూడా స్వల్ప మెజారిటీతోనే మారిపోయి…. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు.

ఇబ్రహీంపట్నంలో పోలైన, ఈవీఎంలో చూపిన ఓట్లకు మధ్య తేడా 1267 ఓట్లుగా ఉన్నాయి. ఇక్కడ మల్ రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి ఓట్ల తేడా వెనుక మర్మం తెలిస్తే ఫలితం తారుమారు అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ధర్మపురి నియోజకవర్గంలోనూ ఓట్ల తేడా 538గా ఉంది. ఇక్క టీఆర్‌ఎస్ అభ్యర్థి 441 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇలా పోలైన ఓట్లకు, ఈవీఎంలో చూపిన ఓట్లకు తేడా ఎందుకుందన్న దానిపై ఈసీ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతోంది. చిన్నచిన్న పొరపాట్లు జరిగి ఉంటాయని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ వ్యాఖ్యానించారు.

కొన్ని చోట్ల ఫలితాలను తారుమారుచేసే స్థాయిలో తేడా ఓట్లు ఉన్నాయి కదా అని ప్రశ్నించగా… విచారణ జరిపిస్తామని చెప్పారు.

First Published:  15 Dec 2018 1:16 AM GMT
Next Story