Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోతో నటించట్లేదు -రాశి ఖన్నా

తెలుగు ఇండస్ట్రీ కి రాశి ఖన్నా వచ్చి దాదాపు అయిదేళ్ళకి పైగా అవుతుంది, కానీ ఇప్పటి వరకు కుర్ర హీరోలతో తప్ప స్టార్ హీరోస్ తో నటించలేదు ఈ భామ. అయితే ఇటివలే ఈ హీరోయిన్ యాక్షన్ హీరో గోపిచంద్ సరసన ఒక సినిమా నటించబోతుంది అనే రూమర్ ఫిలిం నగర్ లో హలచల్ చేసింది. అయితే ఈ వార్తలపై రాశిఖన్నా తాజాగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేసింది. ఇంతకుముందు […]

ఆ హీరోతో నటించట్లేదు -రాశి ఖన్నా
X

తెలుగు ఇండస్ట్రీ కి రాశి ఖన్నా వచ్చి దాదాపు అయిదేళ్ళకి పైగా అవుతుంది, కానీ ఇప్పటి వరకు కుర్ర హీరోలతో తప్ప స్టార్ హీరోస్ తో నటించలేదు ఈ భామ. అయితే ఇటివలే ఈ హీరోయిన్ యాక్షన్ హీరో గోపిచంద్ సరసన ఒక సినిమా నటించబోతుంది అనే రూమర్ ఫిలిం నగర్ లో హలచల్ చేసింది. అయితే ఈ వార్తలపై రాశిఖన్నా తాజాగా స్పందించింది.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేసింది. ఇంతకుముందు గోపిచంద్ సరసన “జిల్” సినిమాలో రాశిఖన్నా నటించింది. అయితే ఈ సినిమాపై రాశిఖన్నానే స్వయంగా స్పందించడంతో ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున ఈ సినిమాని తమిళ డైరెక్టర్ తిరు డైరెక్ట్ చేయబోతున్నాడు. గోపీచంద్ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయితే ఇక తెలుగు డైరెక్టర్స్ తనకి హిట్ ఇవ్వలేరేమో అని భావించాడో ఏమో గాని తమిళ డైరెక్టర్ తో తెలుగు సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

First Published:  15 Dec 2018 2:49 AM GMT
Next Story