Telugu Global
NEWS

పెర్త్ టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా 3 వికెట్లకు 172 పరుగులు

ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్ లో 326 పరుగులకు ఆలౌట్ విరాట్ కొహ్లీ 82 నాటౌట్, అజింక్యా రహానే 51 నాటౌట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వంద క్యాచ్ ల విరాట్ కొహ్లీ ఇశాంత్ బౌలింగ్ లో విరాట్ కొహ్లీ డెడ్లీ క్యాచ్ టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల రెండోటెస్ట్ రెండోరోజు ఆటలో మరింత వేడెక్కింది. పెర్త్ వాకా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ రెండో రోజు ఆటలో… ఆతిథ్య ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులకే ఆలౌట్  చేసిన టీమిండియా… ఆట ముగిసే […]

పెర్త్ టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా 3 వికెట్లకు 172 పరుగులు
X
  • ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్ లో 326 పరుగులకు ఆలౌట్
  • విరాట్ కొహ్లీ 82 నాటౌట్, అజింక్యా రహానే 51 నాటౌట్
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వంద క్యాచ్ ల విరాట్ కొహ్లీ
  • ఇశాంత్ బౌలింగ్ లో విరాట్ కొహ్లీ డెడ్లీ క్యాచ్

టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల రెండోటెస్ట్ రెండోరోజు ఆటలో మరింత వేడెక్కింది. పెర్త్ వాకా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ రెండో రోజు ఆటలో… ఆతిథ్య ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా… ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 172 పరుగుల స్కోరు సాధించింది.

కొహ్లీ-రహానే షో….

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఫైటింగ్ హాఫ్ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. కొహ్లీ మొత్తం 181 బాల్స్ ఎదుర్కొని… 9 బౌండ్రీలతో 82 పరుగుల స్కోరు సాధిస్తే… రహానే 103 బాల్స్ లో ఆరు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 51 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా…. 108.3 ఓవర్లలో 326 పరుగులకే పరిమితమయ్యింది. కంగారూ ఆటగాళ్లలో ఓపెనర్ హారిస్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టీమిండియా బౌలర్లలో ఇశాంత్ శర్మ 4 వికెట్లు, బుమ్రా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కంటే టీమిండియా 154 పరుగులతో వెనుకబడి ఉంది. చేతిలో మరో ఏడు వికెట్లు మిగిలే ఉన్నాయి.

మూడోరోజు ఆటలో సైతం టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ ఇదేజోరు కొనసాగించే పక్షంలో… భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం ద్వారా మ్యాచ్ పై పట్టుబిగించే అవకాశం ఉంది.

విరాట్ కొహ్లీ క్యాచ్ ల సెంచరీ….

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ లో మాత్రమే కాదు… ఫీల్డింగ్ లో సైతం సెంచరీ సాధించగలనని చాటుకొన్నాడు.

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండోటెస్ట్ తొలిరోజు ఆటలో…. టీమిండియా ఫీల్డర్ గా కొహ్లీ సెంచరీ రికార్డు సాధించాడు. ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ బౌలింగ్ లో… ఆస్ట్రేలియా రెండోడౌన్ ఆటగాడు పీటర్ హ్యాండ్స్ కోంబ్…. ఇచ్చిన క్యాచ్ ను …స్లిప్స్ లో ఫీల్డర్ గా ఉన్న విరాట్ కొహ్లీ అనూహ్యంగా …ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకొని వారేవ్వా… ఏమి క్యాచ్ అనిపించాడు.

అంతేకాదు…ఈ క్రమంలో తన ఫస్ట్ క్లాస్ కెరియర్ లో వంద క్యాచ్ ల మైలురాయిని చేరాడు. టెస్ట్ క్రికెట్లో కొహ్లీకి ఇది 69వ క్యాచ్ కాగా…రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో మరో 31 క్యాచ్ లు సైతం ఉన్నాయి. ఓవరాల్ గా…క్యాచ్ ల సెంచరీ పూర్తి చేసి… తన ఖాతాలో మరో అరుదైన రికార్డు జమ చేసుకొన్నాడు.

ప్రస్తుత పెర్త్ టెస్ట్ కు ముందు వరకూ 74 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలతో సహా 6 వేల 368 పరుగులు సాధించాడు.

First Published:  15 Dec 2018 6:40 AM GMT
Next Story