Telugu Global
Cinema & Entertainment

"సై రా" కోసం పెద్ద సాహసం చేస్తున్న చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటివలే హైదరబాద్ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలో మైసూరు షెడ్యూల్ కి వెళ్లనుంది. అయితే ఈ మైసూరు షెడ్యూల్ కంటే ముందే ముంబై లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ షూటింగ్ లో వీరు స్పెషల్ గా డిజైన్ చేసిన స్విమ్మింగ్ పూల్ లో నీటిలో ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరించబోతున్నారు […]

సై రా కోసం పెద్ద సాహసం చేస్తున్న చిరంజీవి
X

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “సై రా” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటివలే హైదరబాద్ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలో మైసూరు షెడ్యూల్ కి వెళ్లనుంది. అయితే ఈ మైసూరు షెడ్యూల్ కంటే ముందే ముంబై లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఈ షూటింగ్ లో వీరు స్పెషల్ గా డిజైన్ చేసిన స్విమ్మింగ్ పూల్ లో నీటిలో ఒక యాక్షన్ సీన్ ని చిత్రీకరించబోతున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ షూటింగ్ లో చిరంజీవి బ్రీత్ ఛాలెంజింగ్ గా ఈ నీటి టాస్క్ ని చేయబోతున్నారట. ఈ టాస్క్ కోసం ముంబై లో ఎక్స్పర్ట్స్ ని నియమించారట. వచ్చే వారం లో వీరు ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

మూవీ లో ఒక సమయం లో చిరంజీవి నీళ్ళలో ఉండి ఫైట్ చేయాల్సివస్తుందట. అయితే ఇంత ఏజ్ లో చిరంజీవి ఈ యాక్షన్ సీక్వెన్ లో పాల్గొంటున్నాడు అంటే రిస్క్ అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా హీరోయిన్ గా నటిస్తుంది.

First Published:  14 Dec 2018 6:44 AM GMT
Next Story