Telugu Global
NEWS

హరికృష్ణ శవం వద్దే టీఆర్‌ఎస్‌తో పొత్తు చర్చలు జరిపింది మీరు!.... 2.46 గంటలకే ట్వీట్‌ పెట్టారు కదా....

హోదాను వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ వాళ్లు సంబరపడడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించడంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇదే చంద్రబాబు ఎన్నికలకు పది రోజుల ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నించామని బహిరంగ సభల్లోనే చెప్పారని బొత్స గుర్తు చేశారు. హరికృష్ణ శవాన్ని పక్కనపెట్టుకుని కేటీఆర్‌తో పొత్తు చర్చలు జరిపింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ కూడా స్వయంగా చెప్పారన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌కు చెప్పానని లగడపాటి కూడా […]

హరికృష్ణ శవం వద్దే టీఆర్‌ఎస్‌తో పొత్తు చర్చలు జరిపింది మీరు!.... 2.46 గంటలకే ట్వీట్‌ పెట్టారు కదా....
X

హోదాను వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ వాళ్లు సంబరపడడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించడంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇదే చంద్రబాబు ఎన్నికలకు పది రోజుల ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నించామని బహిరంగ సభల్లోనే చెప్పారని బొత్స గుర్తు చేశారు. హరికృష్ణ శవాన్ని పక్కనపెట్టుకుని కేటీఆర్‌తో పొత్తు చర్చలు జరిపింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.

ఈ విషయాన్ని కేటీఆర్‌ కూడా స్వయంగా చెప్పారన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా టీఆర్‌ఎస్‌కు చెప్పానని లగడపాటి కూడా వెల్లడించారని వివరించారు. టీడీపీతో పొత్తుకు టీఆర్‌ఎస్ అంగీకరించి ఉంటే చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడేవారా అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రయోజనాలకు అడ్డుపడుతోందని చెబుతున్న టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు ఎందుకు చర్చలు జరిపారని ప్రశ్నించారు.

కేసీఆర్‌ యాగానికి చంద్రబాబు వెళ్లడం, పరిటాల సునీత కుమారుడి పెళ్లికి కేసీఆర్‌ రావడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కుమ్మక్కు అయింది చంద్రబాబు, కేసీఆర్‌ కాదా అని నిలదీశారు. నిజాలు ఇలా ఉంటే కేసీఆర్‌, జగన్‌ కలిసిపోయారంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని… అందుకే తాము పక్క రాష్ట్రాల్లో పోటీ చేయలేదన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ తప్పుడు సర్వేలు వెల్లడించడం వెనుక రాజకీయ కుట్ర ఉందా… లేదంటే లోకేష్‌తో కలిసి బెట్టింగ్‌ల కోసం ఇలా చేశారా అన్నది అనుమానంగా ఉందన్నారు. లగడపాటి రాజగోపాల్‌ను చరిత్ర ఎన్నటికీ క్షమించదన్నారు. పైన దేవుడు అనే వాడు ఒకడుంటాడని… కుట్రలు కుతంత్రాలు ఎక్కువ కాలం సాగబోవన్నారు. తోటివాళ్లను నాశనం చేయాలనే చూస్తే అది ఎళ్లవేళలా సాధ్యం కాదన్నారు బొత్స.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తానే కారణమని చంద్రబాబు చెబుతుంటే నవ్వొచ్చిందన్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే సిగ్గేస్తోందన్నారు. చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో ఆయన చెబుతున్న మాటలను బట్టి ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. లాభం జరిగితే తన ఖాతాలో వేసుకోవడం, నష్టం వస్తే మాత్రం పక్కోడి ఖాతాలోకి వేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

గెలిచిన టీఆర్‌ఎస్‌ను ఎవరైనా అభినందిస్తే చంద్రబాబు తప్పుపడుతున్నారని… మరి కౌంటింగ్‌ రోజు మధ్యాహ్నం 2.46 నిమిషాలకు కేసీఆర్‌ను అభినందిస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2. 57 నిమిషాలకు చంద్రబాబు కేసీఆర్‌ను అభినందిస్తూ ట్వీట్ పెట్టారన్నారు. అలా సంప్రదాయం ప్రకారం శుభాకాంక్షలు తెలపడంతో తప్పు లేదన్నారు. కానీ ఒక్క వైసీపీ వాళ్లను మాత్రమే శుభాకాంక్షలు ఎలా చెబుతారంటూ టీడీపీ మంత్రులు ప్రశ్నించడం విచిత్రంగా ఉందన్నారు.

రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే లగడపాటి లాంటి వారు వచ్చి ముత్యాల ముగ్గు వేస్తున్నారని విమర్శించారు. అసదుద్దీన్‌ ఓవైసీ ఏపీలో ప్రచారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ముస్లింలకు వైఎస్ అండగా నిలిచారు కాబట్టే ఓవైసీలకు జగన్‌ అంటే అభిమానం అన్నారు. ఓవైసీ ఏపీకి వస్తాననగానే కొన్ని టీవీ చానళ్లు ఓవైసీ తెలంగాణ వ్యక్తి అంటూ ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చే గిఫ్ట్ అన్నది చంద్రబాబుకు, కేసీఆర్‌కు మధ్య వ్యవహారమన్నారు.

పవన్ కల్యాణ్‌ అనంతపురంలో తనకు వార్నింగ్‌లు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు బొత్స. చిన్నపిల్లాడి తరహాలో తేలుస్తా… తాట తీస్తా… తేల్చుకుందాంరా అంటూ మాట్లాడుతున్నారన్నారు. ఒక నాయకుడు అలా మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయం ఏమైనా కుస్తీ పోటీ అనుకుంటున్నారా అని పవన్‌ను ప్రశ్నించారు.

First Published:  14 Dec 2018 12:55 PM GMT
Next Story