Telugu Global
NEWS

హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ

హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ తలిగింది. వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్‌ను వర్తింప చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇటీవల తిరుమలతో పాటు, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వంశపారంపర్యంగా పనిచేస్తున్న అర్చుకులకు బలవంతంగా రిటైర్ మెంట్ వర్తింప చేశారు. అందులో టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ఉన్నారు. టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుచానూరు అర్చకుడు శేషాద్రి ఆచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తున్న వారు ఉద్యోగులు కాదని అభిప్రాయపడింది. […]

హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ
X

హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ తలిగింది. వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్‌ను వర్తింప చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇటీవల తిరుమలతో పాటు, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వంశపారంపర్యంగా పనిచేస్తున్న అర్చుకులకు బలవంతంగా రిటైర్ మెంట్ వర్తింప చేశారు. అందులో టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ఉన్నారు.

టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుచానూరు అర్చకుడు శేషాద్రి ఆచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తున్న వారు ఉద్యోగులు కాదని అభిప్రాయపడింది. ఉద్యోగులు కానీ వారికి రిటైర్ మెంట్‌ వర్తించదని స్పష్టం చేసింది. విధుల నుంచి రిటైర్ మెంట్‌ పేరుతో తొలగించిన వారిని తిరిగి నియమించాలని ఆదేశించింది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో తీసుకొచ్చిన 33/2007 చట్ట ప్రకారం తిరుమల అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వం చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది. తీర్పు పట్ల మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు.

First Published:  13 Dec 2018 10:37 AM GMT
Next Story