Telugu Global
NEWS

ఇంటికొచ్చిన కార్యకర్తలను చూసి.... భావోద్వేగానికి లోనైన కోమటి రెడ్డి

కోమటి రెడ్డి వెంకటరెడ్డి…. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఓటమి ఎరుగని నేతగా…. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా వరుస విజయాలతో సొంత నియోజక వర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. నల్గొండ నుంచి బరిలోకి దిగిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలైన […]

ఇంటికొచ్చిన కార్యకర్తలను చూసి.... భావోద్వేగానికి లోనైన కోమటి రెడ్డి
X

కోమటి రెడ్డి వెంకటరెడ్డి…. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఓటమి ఎరుగని నేతగా…. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇలా వరుస విజయాలతో సొంత నియోజక వర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. నల్గొండ నుంచి బరిలోకి దిగిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలైన తర్వాత ఎట్టకేలకు స్పందించారు.

ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోమటిరెడ్డిని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా తాను ఓడిపోయినప్పటికీ… ప్రజాసేవ చేస్తానని చెప్పారు. నాలుగు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

First Published:  12 Dec 2018 11:01 PM GMT
Next Story