Telugu Global
National

ఎంపీకి కమల్ నాథ్.... రాజస్తాన్ లో ఎవరు?

ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగుర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపిక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కత్తిమీద సాములా మారింది. ఈరోజు రాహుల్ మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాహుల్ ఇంటికి నేతల తాకిడి ఎక్కువైంది. కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాహుల్ దాదాపు ఎంపిక చేశారని కాంగ్రెస్ వర్గాల […]

ఎంపీకి కమల్ నాథ్.... రాజస్తాన్ లో ఎవరు?
X

ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగుర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపిక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కత్తిమీద సాములా మారింది. ఈరోజు రాహుల్ మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాహుల్ ఇంటికి నేతల తాకిడి ఎక్కువైంది.

కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాహుల్ దాదాపు ఎంపిక చేశారని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మధ్యప్రదేశ్ లో బలమైన శివరాజ్ సింగ్ ను ఓడించడంలో కమల్ నాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి గెలుపునకు బాటలు వేశారు. అందుకే ఆయనకే సీఎం పీఠం ఇస్తారని తెలిసింది. బీఎస్పీ మద్దతు కూడగట్టడంలో కూడా కమల్ నాథ్ చొరవకు రాహుల్ ఫిదా అయినట్టు తెలిసింది.

అయితే మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ తో కలిసి కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేసిన జ్యోతిరాధిత్య సింధియాను కూడా రాహుల్ మరిచిపోలేదు. కానీ సింధియాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. 72 ఏళ్ల కమల్ నాథ్ సీఎం కావడానికి 47ఏళ్ల సింధియా అనుకూలమేనా అన్న మీడియా ప్రశ్నకు.. ‘ఖచ్చితంగా…. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని’ జ్యోతిరాధిత్య సింధియా నేషనల్ మీడియాకు తెలుపడం విశేషం.

ఇక రాజస్తాన్ లో మాత్రం కాంగ్రెస్ కు యువ, వృద్ధ నేతల్లో ఎవరిని ఎంచుకోవాలో తెలియడం లేదు. యువనేత సచిన్ పైలెట్, రెండు సార్లు రాజస్తాన్ సీఎంగా చేసిన అశోక్ గెహ్లాట్ లలో అశోక్ గెహ్లాట్ కే సీఎం పదవి వరించబోతున్నట్టు సమాచారం వస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీనియర్ కే పగ్గాలు ఇస్తారని.. అదే సమయంలో సచిన్ పైలెట్ ను తక్కువగా ఏమీ చేయరని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

అయితే రాహుల్ గాంధీ మాత్రం ఈసారి ఆయా రాష్ట్రాల సీఎంల ఎన్నిక ఆ రాష్ట్రంలోని నాయకులు, కార్యకర్తల మనోభీష్టం మేరకే చేయనున్నట్టు సమాచారం అందుతోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలను సమావేశపరిచి వారి నిర్ణయానుసారం సీఎం ఎంపిక చేపట్టబోతున్నట్టు సమాచారం.

First Published:  13 Dec 2018 12:18 AM GMT
Next Story